మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో నిర్మాతలు బాగా నష్టపోయారు. దీంతో తన తదుపరి సినిమాతో పెద్ద హిట్ అందుకోవాలని చూస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' అనే సినిమాలో నటిస్తున్నారు. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.


ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ లాంటి తారలు కీలకపాత్లు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ని వదిలారు. ఈ పోస్టర్ లో చిరంజీవి తెల్లజుట్టుతో కనిపిస్తున్నారు. కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించారు. 


ప్రస్తుతం ఈ లుక్ వైరల్ అవుతోంది. దీంతో పాటు చిన్న వీడియో కూడా వదిలారు. ఇందులో చిరు ఎంట్రీ సీన్ అదిరిపోయింది. చిరుతో పాటు కారులో వచ్చి.. ఆయన కారు డోర్ తీస్తూ కనిపించారు నటుడు సునీల్. చిరు వెంటే ఉండే క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి తన వయసుకి తగ్గ పాత్రలో కనిపించబోతున్నారని పోస్టర్ ని చూస్తేనే అర్ధమవుతోంది. మలయాళ 'లూసిఫర్'లో మోహన్ లాల్ వైట్ కలర్ పంచ్, షర్ట్ తో కనిపిస్తే.. రీమేక్ లో చిరు మాత్రం తెలుగు ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా డ్రెస్ చేసుకున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.