రెండు, మూడు రోజులుగా సీనియర్ నటుడు నరేష్ కి సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. సీనియర్ నటి పవిత్ర లోకేష్ ను అతడు నాల్గో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకొచ్చి హడావిడి చేసింది. నరేష్ కి చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉందని.. ఈ విషయం అతడి తల్లి, దివంగత నటి విజయనిర్మలకి కూడా తెలుసనీ.. ఆమె ముఖం చూసి నేను కంట్రోల్ లో ఉండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది రమ్య రఘుపతి. 

 

మరోపక్క నరేష్ మాత్రం పవిత్రా లోకేష్ తనకు మంచి ఫ్రెండ్ అని చెబుతున్నారు. విత్రా లోకేష్ పై తనకు అభిమానం, గౌరవం ఉన్నాయని నరేష్ అన్నారు. తను డిప్రెషన్ తో బాధపడుతున్న సమయంలో పవిత్రా సపోర్ట్ గా నిలిచిందని.. అలాంటి సమయంలో ఒక ఫ్రెండ్ అవసరం ఉందని.. పవిత్రా తనకు మంచి ఫ్రెండ్ అని అన్నారు. తన మూడో భార్య రమ్య రఘుపతి తనను డబ్బు కోసం వాడుకుందని చెప్పారు నరేష్. ఏరోజు కూడా ఆమె భార్యలా ప్రవర్తించలేదని.. ఆమె గురించి చెప్పడానికే సిగ్గుగా ఉందని అన్నారు. ఆమె దగ్గర పనిచేసే ముస్లిం డ్రైవర్ తో సెక్సువల్ అఫైర్ పెట్టుకుందని సంచలన ఆరోపణలు చేశారు. 

 

ఇక ఈరోజైతే నరేష్, పవిత్రా కలిసి ఉన్న హోటల్ దగ్గరకు వెళ్లి పవిత్రాను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది రమ్య రఘుపతి. మధ్యలో పోలీసులు వచ్చి ఆమెను అడ్డుకున్నారు. అక్రమ సంబంధాలను మీరు ప్రోత్సహిస్తారా అంటూ పోలీసులను నిలదీసింది రమ్య. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. చాలా మంది రమ్య రఘుపతి బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. 

 

ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. అదేంటంటే.. సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రమ్య రఘుపతి బంధువులట. ప్రశాంత్ నీకు వరసకు రమ్యకు అన్నయ్య అవుతాడని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రమ్య ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ స‌త్య‌సాయి జిల్లా, మ‌డ‌క‌శిర‌లోని నీల‌కంఠ‌పురం గ్రామానికి చెందిన మహిళ. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రఘువీరారెడ్డి, రమ్య తండ్రి వరుసకు అన్నదమ్ములు. అలానే 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తండ్రి, రమ్య తండ్రి అన్నదమ్ములట. 

 

వీరి కుటుంబాలు దశాబ్దాల క్రితమే కర్ణాటకకు వలస వెళ్లిపోయాయయట. 'హోటల్‌ మోతీ మహాల్‌' బెంగుళూరులోని చాలా ఫేమస్ హోటల్. దీనికి ఓనర్ రమ్య తండ్రి అని తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం 'సలార్' సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు.