Ginna Movie USA Collection Day 2 : అమెరికాలో 'జిన్నా' కలెక్షన్స్‌లో డ్రాప్ లేదు. స్టడీగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్యను బట్టి రెండో రోజుకు సినిమాను ప్రదర్శించే లొకేషన్స్, స్క్రీన్స్ కౌంట్ తగ్గవచ్చని అంచనా వేశారు. అయితే, అలాగ జరగలేదు.
'జిన్నా' శుక్రవారం అమెరికాలో సుమారు 550 డాలర్లు కలెక్ట్ చేసింది. మొత్తం 21 లొకేషన్స్‌లో సినిమా రిలీజ్ చేయగా, అటు ఇటుగా 50 మంది ప్రేక్షకులు విష్ణు మంచు సినిమా చూడటానికి వచ్చారని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రెండో రోజైన శనివారం రాత్రి ఏడు గంటలకు 14 లొకేషన్స్‌లో 419 డాలర్స్ కలెక్ట్ చేసింది. ఎండ్ ఆఫ్ డే కలెక్షన్స్ 500 డాలర్లకు చేరుకోవచ్చని టాక్. ఫస్ట్ డే, సెకండ్ డే కలెక్షన్స్ చూస్తే స్టడీగా ఉన్నట్టు లెక్క.
'జిన్నా'కు భారీ హిట్ టాక్ రాలేదు. కానీ, కొందరు క్రిటిక్స్ నుంచి డీసెంట్ రివ్యూస్ వచ్చాయి. కొంతమంది బాలేదని పేర్కొన్నారు. అయితే విడుదలకు ముందు నుంచి విష్ణు మంచుపై కొందరు నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. అందువల్ల, థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదా? అని ట్రేడ్ వర్గాలు కారణాలు అన్వేషించే పనిలో పడ్డాయి.
Also Read : ఓయో కంటే 'జిన్నా' థియేటర్లు బెస్ట్ - రెచ్చిపోతున్న ట్రోలర్స్, మీమర్స్
బాక్సాఫీస్ పరంగా చూసుకుంటే విష్ణు మంచు (Vishnu Manchu) ఖాతాలో మరో ఫ్లాప్ చేరినట్టేనని తెలుగు సినిమా ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'జిన్నా' ఫస్ట్ డే కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో మరీ దారుణంగా ఉన్నాయని స్పష్టం అయ్యింది. అమెరికా సంగతి పక్కన పెడితే... తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'జిన్నా'కు మంచి థియేటర్లు లభించాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్ దగ్గర విష్ణు మంచు భారీ కటౌట్ పెట్టారు. భారీ ఎత్తున ప్రచారం చేశారు. అయితే, కలెక్షన్స్ మాత్రం ఆ స్థాయిలో లేవు. ఓపెనింగ్ డే పది నుంచి పన్నెండు లక్షల రూపాయల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల టాక్. రెండో రోజు కూడా సినిమాకు అంతే రావచ్చని అంచనా వేస్తున్నారు.
'జిన్నా'లో ఇద్దరు గ్లామర్ హీరోయిన్స్ సన్నీ లియోన్ (Sunne Leone), పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ఉన్నారు. వాళ్ళు కూడా సినిమాకు హెల్ప్ కాలేదు. పాయల్, సన్నీని చూడటానికి ప్రేక్షకులు ఎవరూ థియేటర్లకు రాకపోవడం గమనించాల్సిన అంశం. సునీల్, 'వెన్నెల' కిశోర్, రఘుబాబు, అన్నపూర్ణమ్మ వంటి స్టార్ కమెడియన్స్, సీజనల్ ఆర్టిస్టులు సినిమాలో ఉన్నారు. ఎంత మంది ఉన్నా సరే థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో ఫెయిల్ అయ్యారు.
కలెక్షన్ కింగ్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. మోహన్ బాబు ఆశీసులతో... ఆయన నిర్మాణంలో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై 'జిన్నా' సినిమా రూపొందింది. దీనికి మోహన్ బాబు స్క్రీన్ ప్లే రాశారు. ఈ చిత్రానికి అసలు కథ... దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి అందిస్తే, కోన వెంకట్ స్క్రిప్ట్ రాశారు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.