టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసిన ఉత్తరాది భామల్లో కాజల్ ముందుంటుంది. తెరపై ట్రెండీగా కనిపించడంతో పాటు హీరోల పక్కన మాస్ స్టెప్పులు వేస్తూ అలరిస్తోంది. ఓ పక్క సినిమాలు మరో పక్క వెబ్ సిరీస్ లు అంటూ కాజల్ ఎంతో బిజీగా గడుపుతోంది. అయితే కెరీర్ ఆరంభంలో ఆమెని ఓ డైరెక్టర్ అందరి ముందు అరిచేసి అవమానించారట. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!



తొలి ఛాన్స్.. 



మాస్‌ కమ్యునికేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన కాజల్‌.. కొన్నాళ్లు మోడలింగ్‌ చేసింది. అదే సమయంలో ఆమెకి బాలీవుడ్ లో 'క్యు హో గయా న' అనే సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ వెళ్లాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉండేదట కాజల్. ఫైనల్ గా తను నటిగా మారాలనుకున్నప్పుడు తల్లితండ్రులు సపోర్ట్ చేశారని చెప్పింది కాజల్. 



డోంట్ మేక్ ఫ్రెండ్స్.. 



ఇండస్ట్రీలో ఎవరితో ఎలాంటి స్నేహాలు పెట్టుకోకూడదని కాజల్ అంటోంది. ఇక్కడ పని చేయడానికి మాత్రమే వచ్చామని.. స్నేహం కోసం కాదని చెబుతోంది. ప్రయివేట్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ సెపరేట్ గా ఉండాలని.. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవారికి ఇదే చెబుతానని అంటోంది.  


ఫుడ్ లవర్.. 



పంజాబీ కుటుంబానికి చెందిన కాజల్ ఫుడ్ లవర్ అట. బాగా తింటానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది కాజల్. తన జీన్స్ లో అది ఉందని.. ఎంత తింటానో అదే రేంజ్ లో వ్యాయామాలు కూడా చేస్తానని అంటోంది. తన భర్త గౌతమ్ కూడా రకరకాల వంటకాలు ఇష్టపడతారని.. ఆయన కోసం వంట కూడా చేస్తున్నట్లు కాజల్ రీసెంట్ గా చెప్పింది. 



తెలుగంటే బ్రెయిన్ పని చేయదు.. 



కాజల్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటేసింది. కానీ ఇప్పటివరకు తెలుగు మాత్రం నేర్చుకోలేదు. మిగిలిన హీరోయిన్లంతా సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు. కానీ కాజల్ మాత్రం ఇప్పటికీ తెలుగు మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటుంది. తెలుగు భాష నేర్చుకోవడానికి కాజల్ కూడా ప్రయత్నించిందట. చాలా పుస్తకాలు కూడా చదివింది. కానీ తెలుగు మాట్లాడాలంటే తన బ్రెయిన్ తొందరగా పని చేయదని ఓ సందర్భంలో కాజల్ చెప్పింది. అందుకే స్పష్టంగా మాట్లాడలేదట. కానీ బాగా అర్ధమవుతుందని అంటోంది. 


అవమానించిన డైరెక్టర్.. 



కాజల్ 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఓ సన్నివేశంలో తను బాగా ఏడవాల్సి వచ్చింది. కానీ తనకు ఏడుపు రాకపోవడంతో డైరెక్టర్ తేజ అందరి ముందు కాజల్ మీద అరిచారట. కొత్త ఇండస్ట్రీ చుట్టూ పదుల సంఖ్యలో జనాలు ఉన్నారు. ఒక్కసారిగా అందరి ముందు అరవడంతో అవమానంగా ఫీలైందట కాజల్. కానీ ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నానని చెబుతోంది. 



జనాలను ఏడిపిస్తే హ్యాపీ.. 
నిజానికి కాజల్ తన లైఫ్ లో ఎప్పుడూ ఏడవలేదట. అందుకే దర్శకుడు తేజ ఏడుపు సన్నివేశంలో నటించమన్నప్పుడు ఇబ్బంది పడిందట. ఆ సమయంలో ఎలా ఏడవాలో అర్ధం కాలేదని.. కానీ ఇప్పుడు గ్లిజరిన్ లేకుండా ఏడ్చేస్తున్నా అని చెబుతోంది. ఇప్పుడు తన ఎమోషనల్ సీన్స్ జనాలకు బాగా నచ్చుతున్నాయని చెప్పింది. తన కన్నీళ్లు చూసి జనం కన్నీళ్లు పెట్టుకుంటున్నారని.. ఏదో సాధించాననే ఫీలింగ్ ఉందని అంటోంది. 



పెళ్లి తరువాత బిజీ బిజీ.. 
లాక్ డౌన్ లో కాజల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తరువాత ఆమె ఇండస్ట్రీకి దూరం అవుతుందని అనుకున్నారు. కానీ ఆమె మరిన్ని ప్రాజెక్టులు ఒప్పుకుంటుంది. ప్రస్తుతం 'ఆచార్య'లో లీడ్ రోల్ పోషిస్తుంది. అలానే చేతిలో 'ఇండియన్ 2' సినిమా ఉంది. ఇప్పుడు బాలీవుడ్ లో 'ఉమ' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది.