''మీరు ట్రైలర్ (Game On Movie Trailer Review)లో చూసింది కేవలం 10 శాతం మాత్రమే. మేం ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం. మంచి కాన్సెప్ట్, కమర్షియల్ అంశాలతో తెరకెక్కించిన యాక్షన్ డ్రామా ఇది'' అని హీరో గీతానంద్ చెప్పారు. తన సొంత తమ్ముడు దయానంద్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన సినిమా 'గేమ్ ఆన్'. నేహా సోలంకి హీరోయిన్. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ పతాకాలపై రవి కస్తూరి చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ విడుదల కార్యక్రమంలో హీరో గీతానంద్ మాట్లాడుతూ ''గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగికి జీవితంపై విరక్తి చెంది ఒక ఆటలో పడితే ఎలా ఉంటుంది? అనేది మా సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. మధుబాల, ఆదిత్య మీనన్ గారు నటించడంతో సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్లింది. మా ఆటను మన తెలుగు ప్రేక్షకులే గెలిపించాలి. ఈ సినిమాతో మా తమ్ముడు దయానంద్ యాక్షన్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటాడు. నేనూ నటుడుగా పేరు తెచ్చుకోవాలని చాలా కష్టపడ్డా" అని చెప్పారు.
Also Read: టు మినిట్స్ కూడా లేవుగా - వైరల్ అవుతున్న ప్రభాస్ 'సలార్' డైలాగ్స్
నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ..."నిర్మాతగా నా తొలి చిత్రమిది. ప్రస్తుతం నేను ఆస్ట్రేలియాలో ఉంటున్నాను. గీతానంద్ నా క్లాస్మేట్. మేమిద్దరం ఏదో ఒక రోజు సినిమా తీద్దామని అనుకున్నాం. మంచి కథతో 'గేమ్ ఆన్' తీశాం. రాజీ పడకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమా తెరకెక్కించాం. నవాబ్ గ్యాంగ్స్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఇటువంటి కథ ఇప్పటివరకు తెలుగు తెరపై రాలేదు" అని చెప్పారు.
Also Read: హృతిక్ రోషన్ 'ఫైటర్' ఫస్ట్ ఫేక్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?
దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ ''నేను పూరి జగన్నాథ్ గారికి వీరాభిమానిని. ఆయన ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా తీశా. కమర్షియల్ స్క్రిప్ట్ రాసి, రా అండ్ రస్టిక్ ఫిల్మ్ తీశా. సినిమాలో క్యారెక్టర్లు అన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. చావాలని అనుకునే ఓ వ్యక్తి రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? ఆ తర్వాత ఏమైంది? ఆట ఆడించేది ఎవరు? అనేది సినిమా. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ ప్రేక్షకుల్ని అట్ట్రాక్ట్ చేస్తాయి. గీతానంద్ ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాడు. రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకపోయినా ఫ్యామిలీ డార్క్ ఎమోషన్స్ ఉంటాయి" అని చెప్పారు.
Also Read: రవితేజ సినిమాలో కన్నడ హీరోయిన్‌కు ఛాన్స్ - ఆమె ఎవరంటే?
ఈ కార్యక్రమంలో ఆదిత్య మీనన్, హీరోయిన్ నేహా సోలంకి, నటుడు కిరిటీ, సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథ్, నవాబ్ గ్యాంగ్, అశ్విన్ అరుణ్, మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ ఏఆర్ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య మీనన్, మధుబాల, 'బిగ్ బాస్' వాసంతి కృష్ణన్, కిరిటీ, 'శుభలేక' సుధాకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాణ సంస్థలు: కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్, ఎడిటర్: వంశీ అట్లూరి, స్టంట్స్: రామకృష్ణన్, నభా స్టంట్స్, సంగీతం: నవాబ్ గ్యాంగ్, అశ్విన్ - అరుణ్, నేపథ్య సంగీతం: అభిషేక్ ఎ.ఆర్, మాటలు: విజయ్ కుమార్ సిహెచ్, ఛాయాగ్రహణం: అరవింద్ విశ్వనాథన్, నిర్మాత: రవి కస్తూరి, దర్శకత్వం: దయానంద్.