Sreeleela: టాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది క్యూట్ బ్యూటీ శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ,  ఆ తర్వాత టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్ గా ఎదిగింది. సీనియర్ హీరోలతో పాటు యంగ్ స్టార్స్ తోనూ కలిసి నటిస్తూ కెరీర్ ను మాంచి స్వింగ్ లో తీసుకెళ్తోంది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ వరుస అవకాశాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. రీసెంట్ గా మహేష్ బాబుతో కలిసి ‘గుంటూరు కారం’ సినిమాలో నటించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, వసూళ్ల పరంగా పర్వాలేదు అనిపిస్తోంది.


ఆ విషయంలో నాకు ఎలాంటి బాధ లేదు- శ్రీలీల


తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ఆసక్తికర విషయాలు వెల్లడించింది. వరుస సినిమాల చేస్తున్న నేపథ్యంలో ఓ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి వెంటనే మరో క్యారెక్టర్ లోకి ప్రవేశించడం కష్టంగా అనిపించడం లేదా? అనే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. తాను ఎప్పుడూ అలా ఇబ్బంది పడలేదని వివరించింది. “ఏ సినిమాలో నటిస్తే, ఆ సినిమా గురించే పూర్తిగా ఫోకస్ పెడతాను. ఇతర సినిమాల గురించి ఆలోచించను. ఇంకా చెప్పాలంటే నేనెప్పుడూ స్విచ్చాన్‌, స్విచ్చాఫ్‌ పర్సన్‌ లా ఉంటాను. అది నా బలంగా ఫీలవుతున్నాను. ఒకేరోజు మూడు సినిమాల్లో మూడు క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చినా, ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఒక పాత్రలో నుంచి మరో పాత్రలోకి ఈజీగా ఒదిగిపోతాను. సెట్లో ఉన్నంత సేపు యాక్టింగ్ తప్ప మరో ధ్యాస ఉండదు. సెట్‌ నుంచి బయటకొచ్చానంటే సినిమా గురించి అస్సలు ఆలోచించను. సినిమాల్లోనే కాదు, చదవు విషయంలోనూ ఇలాగే ఉంటాను. బుక్ పట్టుకుంటే నేనూ అందరిలాగే స్టూడెంట్ ని అయిపోతాను. ఎక్కడ ఏది చేయాలో నాకు స్పష్టత ఉంది. అందుకే, ఏదీ కష్టంగా అనిపించదు. డ్యాన్స్ విషయంలోనూ ఎప్పుడూ ఒత్తిడిగా ఫీల్ కాను. అదో బాధ్యతగా భావిస్తాను” అని వెల్లడించింది. 


అందం, అభినయంతో అలరించిన శ్రీలీల


తాజాగా ‘గుంటూరు కారం’ సినిమాలో శ్రీలీల అదిరిపోయే డ్యాన్స్ తో అలరించింది. మహేష్ బాబు,  త్రివిక్రమ్  కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల ఫస్ట్ హీరోయిన్ గా నటించగా, మీనాక్షి చౌదరి రెండో హీరోయిన్ గా నటించింది.   రమ్య కృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రంలో శ్రీలీల పట్టు పరికిణి వేసుకొని అందంగా కనిపించింది. ఆమె అందం, అభినయం, డ్యాన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో ఆమె చాలా క్యూట్ గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు.  నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీని అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించారు.


Read Also: మాట నిలబెట్టుకున్న ‘హనుమాన్’ టీమ్, అయోధ్య రామయ్యకు భారీ విరాళం