టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అతడి తండ్రి నిర్మాత బెల్లంకొండ సురేష్ లపై ఛీటింగ్ కేసు నమోదైంది. వీఎల్ శ్రవణ్ కుమార్ అనే ఫైనాన్షియర్ ఈ కేసు పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది. శ్రవణ్ కుమార్ ఫిర్యాదు ప్రకారం.. బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ శ్రీనివాస్ తన దగ్గర నుంచి రూ.85 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారట. 


2018-2019 మధ్యలో ఓ సినిమా ప్రొడక్షన్ కోసం డబ్బు తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా మంది టెక్నిషియన్స్ కి తన అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్లు శ్రవణ్ వెల్లడించారు. కొంతకాలం తరువాత శ్రవణ్ తన డబ్బుని తిరిగివ్వమని అడిగితే.. తండ్రీకొడుకులు పట్టించుకోలేదట. అంతేకాదు.. తనపై బెదిరింపులకు పాల్పడినట్లు కంప్లైంట్ లో పేర్కొన్నారు శ్రవణ్. తనను సినిమాలో భాగస్వామిగా చేస్తామని చెప్పి.. డబ్బు తీసుకొని ఇప్పుడు మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించాడు శ్రవణ్. 


ప్రస్తుతం కేసు విచారణ జరుగుతుంది. మరి దీనిపై బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ శ్రీనివాస్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో 'ఛత్రపతి' రీమేక్ లో నటిస్తున్నారు. అలానే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇదొక పాన్ ఇండియా ఫిల్మ్ అని.. టాప్ డైరెక్టర్ వర్క్ చేయబోతున్నట్లు సమాచారం.  


Also Read: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!


Also Read: ఆ ప్రేమకథ ఎప్పటికీ ఎండ్ అవ్వకూడదని కోరుకుంటున్న సమంత