యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఈ రోజు పండగ రోజు. 'రాధే శ్యామ్' సినిమా విడుదలతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఏపీలో ఈ సందడి ఎక్కువ కనిపించింది. టికెట్స్ కోసం విజయనగరంలో జనాలు ఎగబడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా థియేటర్లలో గురువారం సాయంత్రం వరకూ ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. అందుకని, టికెట్స్ కోసం డై హార్డ్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర బారులు తీరారు. కౌంటర్స్ ఓపెన్ చేసిన వెంటనే ఎగబడ్డారు. కొంత మంది అర్ధరాత్రి రోడ్ల మీద సందడి చేశారు. ర్యాలీలు తీశారు. ఇప్పుడు నెట్టింట ఈ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: Radhe Shyam Review - 'రాధే శ్యామ్' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?
Also Read: సేమ్ మిస్టేక్ రిపీట్ చేసిన 'రాధే శ్యామ్' టీమ్! ఎందుకు ఇలా?