మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah), హైదరాబాదీ యువకుడు & హిందీ సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్ విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారా? అంటే... 'ఓ యస్', 'అవును అవును' అని ముంబై జనాలు చెబుతున్నారు. గోవాలో 2023కి ఈ జోడీకి వెల్కమ్ చెప్పారు. వాళ్ళిద్దరూ లిప్ కిస్ పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ తర్వాత ఇద్దరి లవ్ గురించి బయటకు వచ్చింది. 


తాము ప్రేమలో ఉన్నట్లు ఇటు తమన్నా గానీ, అటు విజయ్ వర్మ గానీ ఎప్పుడూ చెప్పలేదు. అయితే, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు సోషల్ మీడియాలో విజయ్ వర్మ చేసిన ఒక పోస్ట్ చూస్తే... తమన్నాతో డేటింగ్ విషయాన్ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారనే అనుకోవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ఆ షూస్ తమన్నావే అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ, విజయ్ వర్మ ఏం పోస్ట్ చేశారనేది చూస్తే... 


ఆ కాళ్ళు తమన్నావేనా?
ఇంస్టాగ్రామ్ స్టోరీలో విజయ్ వర్మ ఒక ఫోటో పోస్ట్ చేశారు. అందులో మనుషుల ముఖాలు ఏమీ కనిపించడం లేదు. జస్ట్... ఇద్దరు కాళ్ళు మాత్రమే ఉన్నాయి. మధ్యలో రెడ్ హార్ట్ ఎమోజీ ఉంది. ఆ హార్ట్ ప్రేమకు చిహ్నం అన్నమాట. అందులో ఉన్నవి విజయ్ వర్మ, తమన్నా కాళ్ళు అని నెటిజనులు భావిస్తున్నారు. వాళ్ళిద్దరూ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా వెల్లడించడానికి రెడీ అయ్యారని పోస్టులు చేస్తున్నారు. 


Also Read : కొరటాల శివ సినిమాకు ఎన్టీఆర్ కొబ్బరికాయ కొట్టేది ఆ రోజే


తమన్నా వీడియోకి ఫైర్ ఎమోజీలు 
ఇటీవల తమన్నా ఓ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కింద విజయ్ వర్మ కామెంట్ చేశారు.


రెండు ఫైర్ ఎమోజీలు విజయ్ వర్మ పోస్ట్ చేశారు. వాటి పక్కన మంటల్ని ఆర్పే సిలిండర్ ఒకటి, పక్కన ఫైర్ ఇంజిన్ ఒకటి పోస్ట్ చేశారు. తమన్నా వేడి పెంచేస్తున్నారని, వాటిని ఆర్పడానికి ఫైర్ ఇంజిన్లు కావాలనేది ఆయన ఉద్దేశం. 


విజయ్ వర్మ కామెంట్ కింద వింత వింత రియాక్షన్లు వస్తున్నాయి. 'తమన్నాను వదిలేయ్ రా బాబు' అని ఒకరు రిప్లై ఇస్తే... 'విజయ్ వర్మను వదిలేయ్' అంటూ తమన్నాకు సలహా ఇచ్చారు ఒకరు. కొంత మంది 'డార్లింగ్స్' అంటున్నారు. ఒకరు విజయ్ వర్మను బావ అన్నారు కూడా!


Also Read : ఇండియాలో 'యాంట్ మ్యాన్ 3' అడ్వాన్స్ బుకింగ్స్ - 'అల' హిందీ రీమేక్‌తో కంపేర్ చేస్తే... 


హిందీలో 'పింక్' సినిమాతో విజయ్ వర్మ గుర్తింపు తెచ్చుకున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌ జంటగా నటించిన 'గల్లీ బాయ్‌'లో కూడా ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. గత ఏడాది ఆలియా భట్‌కు జోడీగా నటించిన 'డార్లింగ్స్‌' నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అందులో శాడిస్ట్‌ ప్రేమికుడు, భర్తగా విజయ్‌ వర్మ నటన జనాలను ఆకట్టుకుంది. అతడు పుట్టింది, పెరిగిందీ ఇక్కడే. అతడిది మార్వాడీ ఫ్యామిలీ. సినిమాల్లో అవకాశాల కోసం ముంబై వెళ్ళాడు. నాని హీరోగా నటించిన 'మిడిల్ క్లాస్ అబ్బాయి'లో విలన్ రోల్ చేశాడు. విజయ్ వర్మ నటించిన తెలుగు సినిమా అదొక్కటే. తమన్నా సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమారు పదేళ్ళుగా తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేస్తున్నారు. వీ


ప్రస్తుతం తమన్నా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే... మెగాస్టార్ చిరంజీవికి జోడీగా 'భోళా శంకర్' చేస్తున్నారు. అందులో చిరు చెల్లెలుగా కీర్తీ సురేష్ కీలక పాత్ర చేస్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత చిరు, తమన్నా కలయికలో వస్తున్న చిత్రమిది. తమిళంలో రజనీకాంత్ 'జైలర్' సినిమాలో నటిస్తున్నారు. హిందీలో 'బోల్ చుడీయా', మలయాళంలో 'బాంద్రా' సినిమాలు చేస్తున్నారు. 'జీ ఖర్దా' వెబ్ సిరీస్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం మరో వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు.