Nithin and Sreeleela's Extra Ordinary Man movie trailer release date: నితిన్ తన జెండా, ఎజెండా ఒక్కటే అని అంటున్నారు. అంటే... ఆయన రాజకీయాల్లోకి ఏమీ రావడం లేదు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'ఎక్స్‌ట్రా - ఆర్డిన‌రీ మ్యాన్'. అందులో జెండా, ఎజెండా ఎంటర్‌టైన్‌మెంట్ అని చెబుతున్నారు. 


'ఎక్స్‌ట్రా - ఆర్డిన‌రీ మ్యాన్' చిత్రాన్ని ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ (Vakkantham Vamsi) తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీ లీల కథానాయిక. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) విలన్ తరహా పాత్రలో నటిస్తున్నారు. హీరోగా నితిన్ 32వ చిత్రమిది. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ భాగస్వామ్యంతో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో ట్రైలర్ విడుదల చేయనున్నారు. 


సోమవారం 'ఎక్స్‌ట్రా' ట్రైలర్ విడుదల!
Extra Ordinary Man Trailer Telugu: సోమవారం... అంటే ఈ నెల (నవంబర్) 27న 'ఎక్స్‌ట్రా - ఆర్డిన‌రీ మ్యాన్' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు నితిన్ ట్వీట్ చేశారు. 'మన ట్రైలర్ రెడీ! మండే నవంబర్ 27న కుమ్మేద్దాం' అని ఆయన పేర్కొన్నారు. శ్రీ లీలతో కలిసి చిత్రీకరణలో దిగిన వీడియో కూడా ఆయన పోస్ట్ చేశారు.


Also Readకోట బొమ్మాళి పీఎస్ రివ్యూ: రాజకీయ చదరంగంలో పోలీసుల మధ్య యుద్ధం - థ్రిల్ ఇస్తుందా? లేదా? 






'ఎక్స్‌ట్రా' కోసం 300 మంది డ్యాన్సర్లతో పాట నితిన్, శ్రీ లీలపై ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలోని శంషాబాద్‌ ఏరియాలో వేసిన భారీ సెట్‌లో మూడు వందల మందికి పైగా ఫారిన్ డాన్సర్లతో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మాస్ సాంగ్‌ పిక్చరైజ్ చేస్తున్నారు. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయి.


Also Readఆదికేశవ రివ్యూ: మెగా మేనల్లుడి ఊర మాస్ యాక్షన్ - వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?  


ఆల్రెడీ సినిమా నుంచి రెండు పాటలు 'డేంజర్ పిల్ల...', 'బ్రష్ వేస్కో...' విడుదల చేశారు. ఆ రెండిటికీ ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. ఆల్రెడీ సినిమా టీజర్ విడుదల చేశారు. నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన క్యారెక్టరైజేషన్, మూవీ కాన్సెప్ట్, కామెడీ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply



నితిన్, శ్రీ లీల జంటగా... రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సుధేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ, పవిత్రా నరేష్, రవివర్మ, 'హైపర్' ఆది, వెంకటేష్ ముమ్ముడి, జగదీష్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జయరాజ్, ఛాయాగ్రహణం: యువరాజ్ .జె - అర్థర్ ఎ. విలన్స్ - సాయి శ్రీరామ్, కూర్పు: ప్రవీణ్ పూడి.