సినిమా టిక్కెట్ రేటు రూ. ఐదు అంటేనే మనస్తాపం కలుగుతోందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ రమేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో ఎగ్జిబిటర్స్ సమావేశంలో పాల్గొన్న ఆయన టిక్కెట్ల ధరలను నిర్ణయించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 5 రూపాయలు టికెట్ పెట్టె బదులు టీవీలో సినిమా ఫ్రీగా చూడవచ్చన్నారు. 5 రూపాయలతో ఫ్యాన్ లు,ఏసీలు వేసి థియేటర్లు ఎలా నడుపుతామని ప్రశ్నించారు.
Also Read: తెలంగాణలోనూ ఏపీ తరహా మార్పులు... త్వరలో ఆన్‌లైన్ ప్రక్రియ: తలసాని
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో చాలా మంది ఎమ్మెల్యే లకు థియేటర్లు ఉన్నాయని..సీఎం గారితో చెప్పే చనువు ఉన్నా పట్టించుకివడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొడాలి నాని సినిమా మనిషి ఆయన డిస్ట్రిబ్యూటర్,ఎగ్జిబ్యూటర్ అని రమేష్ గుర్తు చేశారు. కొడాలి నాని ఫిల్మ్ చాంబర్‌లో మెంబరని.. ఆయన తలుచుకున్నా ఇలాంటి పరిస్థితి ఉండదన్నారు. కొడాలి నానికి మొత్తం తెలుసని.. .ఫిల్మ్ ఛాంబర్ లో ఇంకా మెంబెర్ షిప్ కొనసాగుతుందన్నారు. ఆయనకు హీరోలు కూడా బాగా క్లోజ్ అన్నారు.
Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..
సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారికి కూడా థియేటర్ల గురించి అన్నీ తెలుసని.. అయినా వారు పట్టించుకోవడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ రేట్ల వివాదం అంతకంతకూ ముదురుతోంది. అతి తక్కువ టిక్కెట్ ధరల వల్ల మొదటగా ఇబ్బంది పడుతున్న ధియేటర్ల యజమానులు విజయవాడలో సమావేశం అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. 18వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూ, 50 శాతం ఆక్యుపెన్సీ విధించడంతో ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అంచనాకు వచ్చారు.
Also Read: బలిసికొట్టుకుంటోంది మీరే.. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై మండిపడిన నిర్మాత !
50శాతం ఆక్యుపెన్సీ తో అద్దెలు,కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేమమని... మూసేసుకోవడమే మంచిదని విజయవాడ ఎగ్జిబిటర్స్ అధ్యక్షుడు సాయిప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చే్శారు. కొత్త సినిమాలు కూడా రిలీజ్ కావడం లేదని.. డిస్ట్రిబ్యూటర్ల నుంచి సహకారం లేకపోతే థియేటర్లు నడపడం కష్టమని నిర్ణయానికి వచ్చారు. ధియేటర్లు నడపాలా లేదా అన్నదానిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.