వేద ఖుషిని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. నువ్వు లేకపోతే ఈ అమ్మ ఉండలేదని అనుకుంటుంది. చిత్ర, వసంత్ ఒక రెస్టారెంట్ కి వస్తారు. చిత్ర వాళ్ళు కూర్చున్న టేబుల్ పక్కనే లాయర్ పరమేశ్వర్ వచ్చి కూర్చుంటారు. చిత్ర ఆయన్ని చూసి గుర్తు పడుతుంది. సులోచన రోడ్డు యాక్సిడెంట్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఉన్న పెన్ డ్రైవ్ ని ఒక వ్యక్తి లాయర్ కి ఇస్తాడు. వెంటనే లాయర్ యశోధర్ కి ఫోన్ చేస్తాడు. మీ అత్తగారి యాక్సిడెంట్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిపార్ట్ మెంట్ నుంచి తెప్పించేశాను, అది మీకు ఇస్తాను డిస్ట్రాయ్ చేసేయండి ఇక ఆ కేసు నిలబడదు కొట్టేస్తారు. మీరు అనుకున్నది సాధించినట్లే అని లాయర్ పరమేశ్వరన్ యష్ తో చెప్తాడు. ఆ మాటలు విని చిత్ర షాక్ అవుతుంది.
Also Read: నందు, మాధవి మాటల యుద్ధం- 'ఆర్య' స్టైల్ లో సామ్రాట్ తో మనసులు మార్చుకుందామన్న తులసి
పెద్దమ్మ యాక్సిడెంట్ కేసులో సీసీటీవీ ఫుటేజ్ బావ ఎందుకు మాయం చేయాలని చూస్తున్నాడని అనుకుని చిత్ర ఈ విషయం వెంటనే వేదకి చెప్పాలని అనుకుంటుంది. అటు మాళవిక వేద వల్ల మనకి అన్ని ప్రాబ్లమ్స్, ఈ పిక్నిక్ తో ఖుషిని వేదకి శాశ్వతంగా దూరం చేస్తాను అని ఆదిత్యతో చెప్పడం ఖుషి వింటుంది. చిత్ర కంగారుగా వేద దగ్గరకి వస్తుంది. రెస్టారెంట్ లో జరిగిన విషయం మొత్తం చిత్ర వేదకి చెప్తుంది. బావగారు ఆ యాక్సిడెంట్ ఫుటేజ్ ని, సాక్ష్యాలు ఎందుకు నాశనం చేయాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదని చిత్ర అంటుంది. ఆయన ఎందుకు అలా చేస్తారు నువ్వు ఏదో చూసి ఏదో అనుకుంటున్నావ్ అని వేద కొట్టిపడేస్తుంది. ఇందాక నేను చూసింది అబద్ధం కాదని చిత్ర చెప్తుంది కానీ వేద మాత్రం యష్ కి సపోర్ట్ చేస్తుంది. చిత్ర ఎంత చెప్పిన వేద వినిపించుకోదు.
పిక్నిక్ లో ఆదిత్యతో కలిసి యష్ చాలా హ్యపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కళ్ళ గంతలు ఆట ఆడుతూ ఆదిత్య వెళ్ళి యష్ ని పట్టేసుకుంటాడు. నాన్నని పట్టేసుకున్నా అని ఆదిత్య సంతోషంగా అరుస్తూ ఉంటే అది చూసి యష్ మురిసిపోతాడు. తర్వాత యష్ కళ్ళకి గంతలు కట్టుకుంటే మాళవికని పట్టుకుని కౌగలించుకున్నట్టు ఊహించుకుంటుంది. తర్వాత నిజంగానే మాళవిక యష్ దగ్గరకి వెళ్లబోతుంటే గమనించిన ఖుషి వెంటనే యష్ చేతికి కావాలని తగిలి అవుట్ అవుతుంది. అది చూసి మాళవిక మొహం మాడిపోతుంది. ఖుషికి ఆ వేద బాగా ట్రైనింగ్ ఇచ్చిందని అది ఉన్నా లేకపోయినా యష్ కి సెక్యూరిటీ గా పంపించినట్టు ఉంది. పిల్ల రాక్షసి ఖుషి యష్ మీద ఈగ కూడా వాలనిచ్చేలా లేదని మనసులో అనుకుంటుంది.
Also Read: 'నీ కోడలు మాయమ్మే' అనిచెప్పిన దేవి, రుక్మిణి చెంప పగలగొట్టిన దేవుడమ్మ- సత్యకి కొత్త కథ చెప్పిన మాధవ్
ఖుషి ఆదిత్యతో కలిసి సెల్ఫీ దిగుదామని యష్ ని అడుగుతుంది. ఆది మాళవికని కూడా రమ్మని పిలుస్తాడు. నలుగురు కలిసి సెల్ఫీ తీసుకుంటారు. యష్ తన ఫోన్లో తీస్తుంటే మాళవిక కావాలనే తన ఫోన్లో తీస్తుంది. ఆ ఫోటోని మాళవిక తన డీపీగా పెట్టుకుంటుంది. అది కూడా వేద, అభిమన్యు మాత్రమే చూసే విధంగా పెడుతుంది. అభిమన్యు ఆ ఫోటో చూసి రగిలిపోతాడు. ఏమనుకుంటుంది ఆ మాళవిక నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చెయ్యదా అని అనుకుంటాడు.
తరువాయి భాగంలో..
మాళవిక వాళ్ళ రూమ్ కి అభిమన్యు వస్తాడు. తనని చూసి మాళవిక, యష్ షాక్ అవుతారు. నువ్వేంటి ఇక్కడ అని మాళవిక కంగారుగా అడిగేసరికి నేను ఇక్కడికి కావాలని రాలేదు ఒక ఇంపార్టెంట్ పర్సన్ తీసుకుని వస్తే వచ్చాను అని చెప్తాడు. ఎవరు తెచ్చారని మాళవిక అడిగేసరికి వేద ఎంట్రీ ఇస్తుంది.