పుట్టినరోజు వేడుకలు చేసేందుకు పరంధామయ్య ఒప్పుకోడు. ఇదే విషయం గురించి నందు, అనసూయ మాట్లాడుకుంటూ ఉంటారు. కొడుకుగా పక్కన ఉండి కూడా ఆయన్ని పుట్టినరోజు చేసుకోవడానికి ఒప్పించలేకపోతున్నా ఎలా ఒప్పించాలో అర్థం కావడం లేదని నందు అంటుంటే తులసితో చెప్పిస్తే ఒప్పుకుంటాడని లాస్య ఎంట్రీ ఇస్తుంది. ఇది వెటకారం కాదు నిజం.. ఇది విషం తాగాలని చెప్తే నవ్వుతూ తాగేస్తారు అది ఆయనకి ఆమె మీద ఉన్న అభిమానం అని అంటుంది. తులసి నా వాళ్ళని తన వైపుకి తిప్పుకునే లోపు తన బంధాలని తెంపేస్తాను అని అనసూయ అంటుంటే నేను అదే పని చేస్తానమ్మ అని మాధవి ఎంట్రీ ఇస్తుంది.
మాధవి: గుడిలో దేవతని అవమానించి మరీ తరిమేశారు మనసు ఎలా వచ్చిందమ్మా, మీరు చేసిన పని తలుచుకుంటే రక్తం మరిగిపోతుంది
నందు: మాట అనేముందు ఏం జరిగిందో తెలుసుకుంటే మంచిది
మాధవి: వదిన చెప్పిన మాటలు మీరు నమ్మలేదు ఇక నామాటలు ఎలా వింటారు. చెప్పుడు మాటలు విని ఎలాగైనా శిక్షించాలి అనుకున్నారు
Also Read: 'నీ కోడలు మాయమ్మే' అనిచెప్పిన దేవి, రుక్మిణి చెంప పగలగొట్టిన దేవుడమ్మ- సత్యకి కొత్త కథ చెప్పిన మాధవ్
లాస్య: తల్లితో మాట్లాడే పద్ధతి ఇది కాదు
మాధవి: నీ దగ్గర పద్ధతులు నేర్చుకోను, అలా చేస్తే తోడేలు దగ్గర ప్రవచనాలు విన్నట్టే.. ఏమ్మా నీ కొడుకు వేరే దానితో ఎఫైర్ పెట్టుకుంటే అది గొప్పగా అనిపించింది, నీ కూతురులాంటి కోడలికి ఉన్న స్నేహం మాత్రం తప్పుగా అనిపించిందా గ్రేట్.. ఒకే ఇంట్లో మనిషికి మనిషికి ఒక్కొక రూల్ ఉందా
అనసూయ: నువ్వు ఏం చేస్తున్నావో తెలుస్తుందా తులసి కోసం తల్లిని ఎదిరించి మాట్లాడతావా
మాధవి: మాట్లాడతాను.. దేవతలాంటి వదిన మీద ఉన్న ప్రేమ అది. రాత్రి పగలు అని తేడా లేకుండా ఈ తల్లికి, అన్నకి ఇరవైయారెళ్ళు ఊడిగం చేసింది. పనిమనిషిలాగా తల వంచుకుని బతికింది. మీరు వదిన మంచితనం మర్చిపోయిన నేను మర్చిపోను నేను మనిషిని రాక్షసిని కాదు, వదిన పట్ల మీ ప్రవర్తన తలుచుకుంటే సిగ్గుగా అనిపిస్తుంది
నందు: మాధవి ఆపు..
మాధవి: ఆపను.. నీకోక మొగుడు, నీకోక పెళ్ళాం ఉన్నప్పుడే బరితెగించి ఎఫైర్ పెట్టుకున్నారు అది తప్పుగా అనిపించలేదు
లాస్య: మాధవి చాలు మీ వదిన తరపు వకాల్తా పుచ్చుకుని వచ్చి ఉంటే ఇక్కడ నుంచి వెళ్లిపో
Also Read: మాధవ్ దేవి తండ్రి కాదని తెలిసి షాకైన సత్య- ఆదిత్యతో తిరగొద్దని రుక్మిణికి చెప్పిన రామూర్తి
తులసి, సామ్రాట్ కొత్త ఇంటిని చూస్తూ ఉంటారు. తులసి మనసులు మార్చుకుందామా అని ఆర్య స్టైల్ లో డైలాగ్ వేస్తుంది. సామ్రాట్ ఏం మాట్లాడకుండా ఉంటాడు. తులసి తన చరిత్ర మొత్తం చెప్తుంది. సామ్రాట్ ని చూపించి ఇతను నా ఫ్రెండ్ అప్పుడప్పుడు నా కోసం వస్తూ ఉంటారని చెప్తుంది. నేను కూడా సింగిల్ లేడి అనే ఇంటి ఓనర్ చెప్తుంది. ఇల్లు ఇవ్వడానికి ఎవరు ముందుకు వచ్చే వారు కాదని ఆమె తన గతం కూడా చెప్పేస్తుంది. మీ ఇల్లుని తులసిగారు గుడిగా మార్చేస్తుందని సామ్రాట్ చెప్తాడు. ఇంటి తాళాలు ఇస్తుంది.
నందు: తులసి చేసే తప్పులు కూడా నీకు ఒప్పులే, తను నీకు దేవత మేము నీకు రాక్షసులం.. మమ్మల్ని నీ ఫ్యామిలిగా చెప్పుకుంటే సిగ్గుగా అనిపిస్తే మమ్మల్ని మర్చిపో. తులసిని, నిన్ను, ఈ ఇంటి బాధ్యతల్ని మోసింది నేనే. 26 ఏళ్లుగా మీ వదిన నీ కోసం చేసింది గుర్తుంది కానీ మీ అన్నయ్య 40 ఏళ్లు చేసింది నీకు గుర్తులేదు. గ్రేట్ మీ అన్న చేసిన త్యాగాలు మర్చిపోయి మాట్లాడుతున్నావ్ తెలుస్తుందా, ఇవన్నీ నాకు చెప్పుకోవాలని లేదు. ఇంత చేసిన కూడా నీకు మాకంటే ఆ పరాయి మనిషే ఎక్కువ అయింది. హ్యపీగా ఆ మనిషి దగ్గరకే వెళ్ళు. కానీ వెళ్ళే ముందు ఒక చిన్న పని చెయ్యి నా రుణం తీర్చి వెళ్ళు, నీకోసం ఖర్చు పెట్టిన ప్రతి పైసా తీర్చి వెళ్ళు
మాధవి: డబ్బులు నందు అకౌంట్ కి వేస్తుంది. నీ రుణం తీర్చుకున్నా చూసుకో.. ఇంకా బ్యాలెన్స్ ఉంటే చెప్పు తీర్చేస్తా. అమ్మా.. నన్ను కనడానికి ఎంత డబ్బులు ఇవ్వాలో చెప్పు ఆ రుణం కూడా తీర్చుకుంటాను
నందు: ఇక బయల్దేరు
తులసి అద్దెకి ఇల్లు దొరికినందుకు తెగ సంతోషపడుతుంది
తరువాయి భాగంలో..
అర్థరాత్రి పరంధామయ్య కి విషెస్ చెప్దామని నందు, అనసూయ, లాస్య వెళతారు. కానీ బెడ్ మీద దిండ్లు పెట్టి దుప్పటి కప్పి పరంధామయ్య తులసి ఇంటికి వెళతాడు. అక్కడ తులసి ఆయన పుట్టినరోజు వేడుక ఘనంగా జరిపిస్తుంది. అదంతా అభి చాటుగా చూసి కోపంతో రగిలిపోతాడు.