ఆదిత్య వచ్చి స్విమ్మింగ్ కి వెళ్దామని యష్ ని అడిగితే సరే అంటాడు. నేను కూడా వస్తాను అని మాళవిక అంటుంది. మా అమ్మ గురించి చీప్ గా మాట్లాడతావా, డాడీతో కలిసి స్విమ్మింగ్ చేస్తావా ఉండు నీ పని చెప్తా అని ఖుషి మనసులో అనుకుని కడుపులో నొప్పి నాటకం ఆడుతుంది. చిత్ర జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటే వేద వచ్చి పలకరిస్తుంది. ఇందాక బావగారి గురించి తప్పుగా మాట్లాడాను అని చిత్ర సోరి చెప్తుంది.


ఖుషి కడుపు నొప్పి అంటూ బాధపడుతున్నట్టు నటిస్తుంది. సడెన్ గా ఇంత కడుపు నొప్పి ఎందుకు వచ్చింది యష్ టెన్షన్ పడుతుంటే మాళవిక మాత్రం స్విమ్మింగ్ కి లేట్ అయిపోతుంది మనం వెళ్దాం పద అని తొందరపెడుతుంది. కావాలనే కడుపునొప్పి అని అరుస్తూ ఉంటుంటే ఇరిటేట్ అయిన మాళవిక ఏంటే నీ గోల అని చిరాకు పడుతుంది.


యష్: పిల్ల ఓ పక్క కడుపు నొప్పి అని బాధపడుతుంటే నువ్వు ఇప్పుడు స్విమ్మింగ్ చేయడం అవసరమా


మాళవిక: చిన్న విషయానికి ఇంత సీన్ క్రియేట్ చేయడం అవసరమా, ఇప్పుడు దీనికి ఏమైంది కడుపు నొప్పే కదా ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది. నేను మళ్ళీ మళ్ళీ పిక్నిక్ కి వస్తానా, స్విమ్మింగ్ చేస్తానా, దీని కడుపు నొప్పి కోసం నా సరదాలు మానుకోవాలా


యష్: ఇప్పుడు నీ పరిస్థితిలో వేద ఉంటే అన్ని పనులు మానేసి ఖుషి దగ్గర కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూనే ఉంటుంది


Also Read: బాబోయ్ తులసి అరాచకం- ఉసిగొల్పేందుకు చూసిన లాస్య, చురకలేసిన నందు


మాళవిక: ఖుషికి అమ్మ ఎవరు.. నేను తనని కన్నది మోసింది నేను. నా కూతురుకి ఆ వేదని అమ్మని చేసి మాట్లాడుతుంటే కంపరంగా ఉంది. ఆ వేదకి కడుపు లేదు పిల్లలు లేరు అది గొడ్రాలు.. అమ్మంటే నేను


యష్: అమ్మ అనే పదం నీ నోటి నుంచి వింటుంటే కంపరంగా ఉంది. అమ్మ విలువ, ప్రేమ నీకు తెలుసా. ఎప్పుడైనా ఒక నిమిషమైన ఖుషికి అమ్మగా ఉన్నావా నువ్వు, అమ్మలా చూసుకున్నావా, ఖుషి అమ్మా అని పిలిచింది వేదని. అమ్మంటే వేద, అమ్మ స్థానానికి అవమానం నువ్వు.. నా దృష్టిలో నువ్వు అసలైన గొడ్రాలివి


అభిమన్యు కోపంగా ఉంటే ఖైలాష్ వచ్చి మాళవిక బాగా ఎంజాయ్ చేస్తుంది అని తను పెట్టిన డీపీ చూపిస్తాడు. ఆ యశోధర్ తో కొత్తగా ఈ క్లోజ్ నెస్ ఏంటి అని మంట పెడతాడు. మీతో ఉన్నప్పుడు కూడా మాళవిక సిస్టర్ ఫేస్ లో సంతోషం లేదు కానీ యశోధర్ పక్కన ఉన్నప్పుడు ఆ సంతోషం చూడు బ్రో. ఈ ఫోటో చూసి అందరూ మీకు ఫోన్ చేసి టార్చర్ పెడతారు. ఏది ఏమైనా సిస్టర్ మిమ్మల్ని అవమానించకూడదు అని ఎక్కిస్తాడు.


Also Read: 'తప్పు చేస్తున్నావ్ నాన్న' మాధవ్ ని కడిగేసిన చిన్మయి- 'దేవి నా బిడ్డే' సత్యకి చెప్పిన ఆదిత్య


అభిమన్యు మాళవికకి ఫోన్ చేసి సీరియస్ అవుతాడు. అ యష్ తో దిగిన ఫోటో డీపీగా పెడతావా నన్ను రెచ్చగొడతావా అని అభి అంటే నువ్వు ఏమైనా నాకు తాళి కట్టిన వాడివా, నన్ను బుజ్జగించాలంటే లేటెస్ట్ డైమండ్ నెక్లెస్ తెచ్చి ఇవ్వు, నా ముందు అరుస్తావ్ ఏంటి అని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. నన్నే బ్లాక్ మెయిల్ చేస్తావా అని అభి కోపంతో రగిలిపోతాడు. నెక్లెస్ కావాలా నీకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తాను అని అభి వేదని కలుస్తాడు. ఎంత అమాయకురాలివి నువ్వు ఆ మాలవిక, నీ భర్త కలిసి నిన్ను మోసం చేస్తుంటే వాళ్ళని నమ్ముతున్నావ్, నీకోక నిజం చెప్పనా.. మీ అమ్మకి యాక్సిడెంట్ చేసింది వేరే ఎవరో కాదు నీ భర్త మొదటి భార్య మాళవిక అని చెప్తాడు.