మాధవ్ సత్య అడిగిన విషయం గురించి ఆలోచిస్తుంటే చిన్మయి అక్కడికి వస్తుంది. గతంలో మాధవ్ రుక్మిణి గురించి మాట్లాడుకున్న మాటలు గుర్తు చేసుకుంటుంది. నాన్న నాకు రోడ్డు మీద ఒక పది రూపాయలు దొరికాయి వాటిని తీసుకున్నా తర్వాత తెలిసింది అవి నా ఫ్రెండ్ వి అని ఏం చేయమంటావ్ అని చిన్మయి మాధవ్ ని అడుగుతుంది. తిరిగి ఇచ్చేయ్ అమ్మా అంటే నాకు ఇవ్వాలని అనిపించడం లేదని చిన్మయి చెప్తుంది. పరాయి వాళ్ళ సొమ్ముకి ఆశపడటం తప్పని మాధవ్ అంటే మరి నువ్వు ఎందుకు ఆ తప్పు చేస్తున్నావ్ నాన్న అని చిన్మయి నిలదీస్తుంది.


చిన్మయి: అమ్మ నాకు అమ్మ కాదు, అసలేం కాదు.. మరి అమ్మని దక్కించుకోవాలని అనుకుని నువ్వెందుకు తప్పు చేస్తున్నావ్ నాన్న


మాధవ్: అమ్మ కాకపోవడం ఏంటమ్మా


చిన్మయి: నాకు అంతా తెలుసు అమ్మ నా సొంత అమ్మ కాదని తెలుసు, దేవి నా సొంత చెల్లి కాదని తెలుసు. నీ చెయ్యి మీద ఉన్న పచ్చ బొట్టు పచ్చబొట్టు కాదని తెలుసు. ఎందుకు నాన్న అమ్మని, చెల్లిని బాధపడుతున్నావ్. అమ్మ ఆఫీసర్ అంకుల్ భార్య, దేవి ఆ అంకుల్ కూతురని తెలిసి కూడా ఎందుకు తప్పు చేస్తున్నావ్


మాధవ్: షాక్ గా చూస్తూ.. వయసుకి మించిన మాటలు మాట్లాడకు


Also read: యష్, మాళవికలకి షాక్ ఇచ్చిన వేద- సులోచన యాక్సిడెంట్ గురించి నిజం తెలుసుకున్న చిత్ర


చిన్మయి: పరాయి వాళ్ళ డబ్బుకి ఆశపడొద్దని నువ్వే చెప్పావ్ కదా నాన్న మరి పరాయి వల్ల భార్యని ఆశపడొచ్చా, అలా ఆశపడటం వల్లే శ్రీరాముడి చేతిలో రావణాసురుడి నాశనం అయ్యాడని తాతయ్య చెప్పాడు


మాధవ్: పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకు లోపలికి వెళ్ళు


చిన్మయి: వద్దు నాన్న అమ్మ, ఆఫీసర్ అంకుల్ చాలా మంచి వాళ్ళు.. వాళ్ళని విడదీసే పాపం చెయ్యొద్దు, మా నాన్న ఇంత చెడ్డవాడంటే ఏడుపోస్తుంది


మాధవ్: మాట్లాడొద్దు అని చెప్పానా లోపలికి వెళ్ళు అని గదమాయిస్తాడు


దేవుడమ్మ కారు ఆగిపోవడంతో దగ్గరలోని ఒక గుడి దగ్గరకి వెళ్ళి కూర్చుంటుంది. అక్కడ దీపాల కొట్టు అతని దేవుడమ్మని చూసి ఆఫీసర్ సర్ వాళ్ళ అమ్మ కదా నేను సార్ కి డబ్బులు ఇవ్వాలి అని ఆమె దగ్గరకి వెళతాడు. నిన్న ఆఫీసర్ గారు, అమ్మగారు వచ్చి దీపాలు వెలిగించారు, నా దగ్గరే కొని 2 వేల రూపాయల నోటు ఇచ్చి చిల్లర లేదంటే మళ్ళీ తీసుకుంటా అని మర్చిపోయి వెళ్లారు, మిమ్మల్ని చూసి చిల్లర ఇద్దామని వచ్చాను అని చెప్తాడు. నిజాయితీగా తెచ్చి ఇస్తున్నందుకు నీ దగ్గరే ఉంచుకో అని దేవుడమ్మ చెప్తుంది.


ఆదిత్య, సత్య గొడవలు పడుతున్నారని నేను టెన్షన్ పడుతుంటే వీళ్ళు బయటకి వచ్చి బాగానే ఉంటున్నారని అనుకుని దేవుడమ్మ సంతోషిస్తుంది. రుక్మిణి టెన్షన్ గా ఉంటే దేవి వచ్చి ఏం జరగనట్టే లోపలికి వెళ్ళిపోతుంది. దేవుడమ్మ ఇంటికి వచ్చి సత్య, ఆదిత్య గుడికి వెళ్ళి దీపాలు పెట్టారంట అని రాజమ్మకి చెప్తుంది. అలా అని ఎవరు చెప్పారని రాజమ్మ అడుగుతుంది. గుడి దగ్గర ప్రమిదలు అమ్మే వ్యక్తి చెప్పాడని చెప్తుంది. నిన్న సత్య అసలు గడప దాటి బయటకి వెళ్లలేదు, ఎవరిని చూసి ఎవరు అనుకున్నాడో సత్య గుడికే వెళ్లలేదు అని రాజమ్మ చెప్పడంతో దేవుడమ్మ కంగారుగా మళ్ళీ బయటకి వెళ్ళిపోతుంది.


Also Read: నందు, మాధవి మాటల యుద్ధం- 'ఆర్య' స్టైల్ లో సామ్రాట్ తో మనసులు మార్చుకుందామన్న తులసి


ఆదిత్యతో కలిసి దీపాలు వెలిగించింది రుక్మిణి అయ్యి ఉంటుందా అని దేవుడమ్మ ఆ గుడికి మళ్ళీ వెళ్తుంది. దేవుడమ్మ అతని దగ్గరకి వెళ్ళి సత్య ఫోటో చూపిస్తుంది. ఈవిడ ఎవరు ఈవిడ కాదని చెప్తాడు. వెంటనే రుక్మిణి ఫోటో చూపిస్తే ఈ మేడమ్ గారే అని షాపు అతను చెప్తాడు. అది విని దేవుడమ్మ షాక్ అవుతుంది. సత్య ఆదిత్యని నిలదీస్తుంది. వేరే వాళ్ళ కూతుర్ని నీ కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని అడుగుతుంది. ఆ మాటకి ఆదిత్య కోపంగా సత్య చెంప పగలగొడతాడు. ఒకడి కూతురు నా కూతురు అని చెప్పాల్సిన అవసరం ఏంటి.. దేవి నా కూతురు, నాకు రుక్మిణికి పుట్టిన బిడ్డ, నా బిడ్డ కాబట్టే తన కోసం పాకులాడుతున్నా అని ఆదిత్య నిజం చెప్పేస్తాడు.


దేవి మన కూతురా అని సత్య షాక్ అవుతుంది. దేవికి నిజం చెప్పి మన ఇంటికి తీసుకురావచ్చు కదా అని అంటుంది. దేవి ఈ ఇంటికి రావడం అంత ఈజీగా కుదరదని చెప్తాడు. రుక్మిణి గురించి ఆదిత్య నిజం చెప్పేందుకు చూస్తుంటే సత్య మాత్రం వినకుండా అపార్థం చేసుకుంటుంది.