తులసికి ఇల్లు అద్దెకి దొరికేలా సామ్రాట్ చేస్తాడు. ఇద్దరి స్నేహానికి గుర్తుగా సామ్రాట్ తులసికి బహుమతి ఇస్తాడు. ఖరీదైన బహుమతి అని తీసుకోవడానికి సంకోచిస్తుంటే పర్లేదు తీసుకోండి ఖరిదైనది కాదు విలువైనదని చెప్పడంతో తీసుకుంటుంది. ఓపెన్ చేసి చూస్తే అందులో తులసి పేరు మీద కీ చైన్ ఇస్తాడు. అది చూసి తులసి సంతోషిస్తుంది. కొత్త ఇంటి తాళం ఆ కీచైన్ కి వేసి చూసి ఇద్దరు మురిసిపోతారు. ఇద్దరు కలిసి ఆటోలో షాపింగ్ కి బయల్దేరతారు. కారులో వెళ్తే రేట్లు ఎక్కువ చెప్తారు, అందుకే ఆటోలో వెళ్తున్నాం అని చెత్త లాజిక్ చెప్తుంది. మీ గెటప్ కారణంగా తన షాపింగ్ బడ్జెట్ పెరిగిపోతుందని తులసి అనేసరికి సామ్రాట్ తన కోటు విప్పేస్తాడు.
కొత్త ఇంటికి సామాను కొనుక్కునేందుకు సామ్రాట్, తులసి మార్కెట్ కి వెళతారు. మాధవి వెళ్లిపోయినందుకు అనసూయ, నందు బాధపడుతూ ఉంటే ఎందుకు ఇంతగా బాధపడుతున్నారు ఒక పరాయి మనిషి కోసం నీ సొంత చెల్లి బంధం తెంపుకుని వెళ్లిపోయిందని లాస్య అంటుంది. బాధపడాల్సింది తను నువ్వు కాదు అని లాస్య చెప్తుంది. తప్పు చేసింది నేను నీ మీద పెట్టిన ఖర్చు పెట్టిన డబ్బు తిరిగిచ్చి రుణం తీర్చుకో అని ఈ లోకంలో ఏ అన్న అయినా చెల్లిని అడుగుతాడా? కానీ నేను అలాంటి దౌర్భాగ్యపు పని చేశాను, నా చెల్లిని హర్ట్ చేశాను కన్నీళ్ళు పెట్టించాను అని నందు చాలా ఫీల్ అవుతాడు. రెచ్చగొట్టింది తనే కదా అని లాస్య ఎక్కించేందుకు చూస్తుంది.
Also Read: 'తప్పు చేస్తున్నావ్ నాన్న' మాధవ్ ని కడిగేసిన చిన్మయి- 'దేవి నా బిడ్డే' సత్యకి చెప్పిన ఆదిత్య
తను రెచ్చగొడితే నా ఇంగిత జ్ఞానం ఏమైంది తన అకౌంట్లో ఉన్న డబ్బు అంతా నాకు వేసిందని నందు బాధపడుతుంటే ఉండనివ్వు మనకి ఖర్చులకి పనికివస్తాయి కదా అసలే మనకి ఉద్యోగాలు కూడా లేవని లాస్య అంటుంది. ఆ మాటకి నందు కోపంగా నోరుముయ్యమని అంటాడు. ఇలా వాగే నా మైండ్ పొల్యూట్ చేసి నన్ను దిగజారిపోయేలా చేస్తున్నావ్ అని అరుస్తాడు. నీ ముందు తులసిని ఆకాశానికి ఎత్తేసి నిన్ను కాదనుకున్న చెల్లి కోసం ఎందుకు తాపత్రయపడుతున్నావ్ అని లాస్య అంటుంది. అన్నాచెల్లెళ్ల మధ్య దూరం పెరగడానికి కారణం తులసి, ఈ ఇంట్లో జరుగుతున్న ప్రతి అనార్థానికి కారణం తులసి, నిన్ను ఎప్పటికీ క్షమించను అని అనసూయ కోపంతో రగలిపోతుంది.
మార్కెట్లో ఒక అమ్మాయి మట్టి ప్రమిదలు కొనడానికి బేరం ఆడుతుంటే తులసి అది చూసి పెద్ద క్లాస్ తీసుకుంటుంది. దీపాలు కొనే దగ్గర పెద్ద చాలా మాట్లాడేస్తుంది. నందు మాధవి మాటలే గుర్తు చేసుకుని చాలా బాధపడతాడు. ఎందుకు ఇలా జరుగుతుంది నాన్న మాట్లాడటం లేదు పిల్లలు దూరం పెడుతున్నారు, వాళ్ళకి ఎంత దగ్గర అవాలని ట్రై చేస్తుంటే అంత దూరం పెడుతున్నారు, తప్పు చేశాను మాధవి నిన్ను బాధపెట్టి చాలా బాధపెట్టాను అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. తులసి తన ఇంటి సామాన్లు అన్ని సామ్రాట్ తో మోయిస్తుంది. తులసి ఇంట్లోకి వచ్చేసరికి గుమ్మం దగ్గర ప్రేమ్, అంకిత, దివ్య ఎదురుగా ఉంటారు.
Also read: యష్, మాళవికలకి షాక్ ఇచ్చిన వేద- సులోచన యాక్సిడెంట్ గురించి నిజం తెలుసుకున్న చిత్ర