భోగి పండుగకి ఇంటికి రమ్మని విన్నీని ఇన్వైట్ చేస్తుంది వేద. తనని యష్ కి పరిచయం చేసేసరికి షాక్ అవుతాడు. తర్వాత ఇంట్లో వాళ్ళందరితో విన్నీ బాగా కలిసిపోతాడు. జోక్స్ వేసి ఇంట్లో వాళ్ళందరిని తెగ నవ్విస్తాడు. యష్ కి మరింత కోపం తెప్పించడం కోసం వేద విన్నీతో క్లోజ్ గా ఉంటుంది. వాళ్ళిద్దరినీ చూసి యష్ కోపంతో రగలిపోతూ ఉంటాడు. విన్నీ, వేద బెస్ట్ ఫ్రెండ్స్ అంట, వీడు ఎక్కడ నుంచి వచ్చాడు కుళ్ళు జోకులు చెప్తుంటే అందరూ తెగ నవ్వుతున్నారు. అయిన అంతగా ఏం చెప్తున్నాడు విందాం అని చాటుగా వింటాడు. చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిచ్చితే ఏడుస్తాడు అని సామెత చెప్తాడు. అది విని తననే అలా అన్నాడు అనుకుని యష్ రగిలిపోతాడు.


Also Read: విన్నీ చూసి షాకైన యష్, మురిసిన వేద- మాళవికని బలి ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్న భ్రమరాంబిక


యష్ గదిలో ఉండగా ఖుషి వచ్చి రమ్మని పిలుస్తుంది. తలనొప్పిగా ఉందని చెప్పేసరికి అమ్మతో చెప్తాను అని వెళ్తుంది. చెప్పినా మీ అమ్మ ఏం చేయదు ఆ బఫూన్ గాడు జోకులు వేస్తుంటే పగలబడి నవ్వుతుంది. మా మధ్య విన్నీ రాకపోయి ఉంటే వేద పరిగెత్తుకుంటూ వచ్చి బామ్ రాసేదా అని అడిగేదని యష్ అనుకుంటూ ఉండగా వేద నిజంగానే వచ్చి బామ్ రాసేదా అని అడుగుతుంది. దొంగ తలనొప్పి కదా అనేసి బామ్ అక్కడే పెట్టేసి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. నా మొహం చూడగానే ఫెక్ తలనొప్పి అని ఎలా తెలిసిపోయింది పెళ్ళాలు మాములోళ్ళు కాదని దణ్ణం పెట్టేస్తాడు.


పండగ రోజు చిత్రకి వసంత్ చీర తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇస్తాడు. యష్ కి నిజంగానే తలనొప్పి వస్తుంది. పెళ్ళాంకి అబద్ధం చెప్తే నిజంగానే తలనొప్పి వస్తుందా అనుకుని బామ్ రాసుకోబోతుంటే వేద వచ్చి తలకి బామ్ రాస్తుంది. భ్రమరాంబిక స్పెషల్ గా రెడీ అయి పార్టీకి వెళ్తున్నా అని చెప్తుంది. మాళవిక కూడా వస్తుందని అభికి చెప్తుంది. వచ్చి చూస్తే మాళవిక రెడీ అవకుండా ఉంటే అభి తనని పార్టీకి వెళ్ళడానికి ఒప్పిస్తాడు. ఫంక్షన్ లో తనని అవమానించడానికి స్కెచ్ వేస్తుంది.  పండగ సందర్భంగా విన్నీ సంప్రదాయంగా రెడీ అయి డ్రెస్ సరి చేసుకుంటూ తిప్పలు పడతాడు. వేద ఇంకా రాలేదేంటి అని యష్ ఎదురుచూస్తూ ఉంటాడు. అప్పుడే మలయాళం ముద్దుగుమ్మ స్టైల్ లో వేద రెడీ అయి వస్తుంది.


Also Read: సీక్రెట్ గా నందుకి ఉద్యోగం ఇప్పించిన మాజీ భార్య- తులసమ్మ వాకిట్లో ముగ్గుల పోటీ


తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు యష్. మొగుడు పెళ్ళాలు ఇద్దరూ ఒకరినొకరు కళ్ళతోనే సైగ చేసుకుంటారు. వేదని పొగుడుతూ సులోచన, మాలిని కాసేపు సరదాగా పోట్లాడుకుంటారు. విన్నీ దగ్గరకి వెళ్ళి ఈ గెటప్ లో ఎలా ఉన్నావ్ అని వేద తిప్పుకుంటూ అడుగుతుంది. అది చూసి యష్ కోపంగా ఉంటాడు. విన్నీ మోకాళ్ళ మీద నిలబడి వేదకి గులాబీ పువ్వు ఇస్తాడు. వేద ఆ పువ్వు తీసుకోబోతుంటే యష్ స్టాపిడ్ అని గట్టిగా అరుస్తాడు. ఇంత పొగడటం అవసరమా, మాళవిక గెటప్ వేసుకోగానే మలయాళీ అయిపోతావా అని తనని తిడతాడు.