దివ్యని స్పెషల్ కోర్స్ చదివించడం కోసం తులసి ఢిల్లీ పంపిస్తుందని తెలిసి నందు ఆగ్రహంతో రగిలిపోతాడు. పక్కనే ఉండి కూడా దివ్యని కాపాడుకోలేకపోయాను ఇంక అంత దూరం అంటే ఎలా అని నందు భయపడుతుంటే దివ్య వెళ్ళే యూనివర్సిటీ లో సెక్యూరిటీ బాగుంటుందని అభి చెప్పేసరికి సరే అంటాడు. పరంధామయ్య ఖాళీగా ఉన్నాడని అనసూయ సూదిలో దారం ఎక్కించమని చెప్తుంది. అది ఎక్కించలేక తంటాలు పడుతుంటే అభి, తులసి నవ్వుతారు. నందు బయటకి వెళ్తు కారు లేదని గుర్తుకి వచ్చి వెనక్కి వస్తాడు. సెంటర్ దాకా వెళ్ళి పావుగంటలో వచ్చేస్తాను కారు ఇవ్వమని నందు అభిని అడుగుతాడు. ఎమర్జెన్సీ ఉంటుంది నాకు మీరు ఖాళీగా ఉన్నారు కదా అని అంటాడు. పరంధామయ్య ప్రేమ్ బండి ఉంది ఆడగనా అని అంటాడు. నేనేమీ ఖాళీగా లేను బయటకి వెళ్తున్నా కావాలంటే డ్రాప్ చేస్తాను వచ్చేటప్పుడు నిదానంగా నడిచి రమ్మనండి ఖాళీగానే ఉన్నారుగా అని ప్రేమ్ అంటాడు. ఆ మాటకి తులసి, నందు ఇద్దరూ బాధపడతారు.


Also Read: నందుని అడుగడుగునా అవమానించిన కుటుంబం- లాస్యని పనిమనిషి చేసేసిన భాగ్య


సంపాదన లేకపోతే మగాడి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా అని మనసులోనే బాధపడతాడు. అప్పుడే లాస్య కాఫీ తీసుకొచ్చి నందుకి కాఫీ ఇవ్వబోయి కూడా ఆగి పరంధామయ్య, అభికి ఇస్తుంది. అది చూసి నందు మరింత బాధపడతాడు. లాస్య నందుని పట్టించుకోకపోగా మీకు కూడా కాఫీ కావాలా ఇంట్లో ఖాళీగానే కూర్చోవడం కదా అని అంటుంది. తర్వాత ఇంట్లో పాలు అయిపోయాయి కాస్త బయటకి వెళ్ళి తీసుకురండి అందరూ బిజీగా ఉన్నారు కదా అని అంటుంది. ఎవరు వెళ్లాల్సిన అవసరం లేదని తులసి అంటుంది. పనికిరాని వాడిని అని ఇంటి జనాభా లెక్కల నుంచి తీసేసిందని నందు బాధపడతాడు. ఇంట్లో వాళ్ళ ప్రవర్తన చూసి తులసి కూడా బాధపడుతుంది.


ఉద్యోగం లేదని తన మీద తనకే నమ్మకం పోయిందని చాలా ఫీల్ అవుతాడు. తులసి దివాకర్ అనే వ్యక్తికి ఫోన్ చేసి తనకి తెలిసిన వ్యక్తికి ఉద్యోగం కావాలని అడుగుతుంది. ఆయన్ని రేపు వచ్చి కలవమనండి అని దివాకర్ చెప్తాడు. నేను రికమండ్ చేసిన విషయం తెలియకూడదు అని తులసి అనేసరికి సరే మీకు ఎంతో కావాల్సిన వ్యక్తి అని అర్థం అయ్యింది ఉద్యోగం ఇస్తాను అని అంటాడు. తులసి అతనితో ఫోన్లో మాట్లాడటం పరంధామయ్య వింటాడు. నందు మీద జాలి పడ్డావా అని అడుగుతాడు. కాదని అంటుంది. మరి ఏ కారణంతో జాబ్ ఇప్పిస్తున్నావ్ అని అడుగుతాడు. ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండటం కోసం హెల్ప్ చేశాను అని అంటుంది.


Also Read: పెళ్ళాం ఫోటో చూసుకుని మురిసిపోయిన యష్- భ్రమరాంబిక అవమానం, ఆగ్రహించిన మాళవిక


నందు ఫోన్ చూసుకుంటూ ఉండగా లాస్య వచ్చి తులసి మీద చాడీలు మొదలుపెడుతుంది. అప్పుడే దివాకర్ నందుకి ఫోన్ చేసి ఇంటర్వ్యూకి రమ్మని పిలుస్తాడు. అదంతా దూరం నుంచి తులసి చూస్తూ ఉంటుంది. జాబ్ తనని వెతుక్కుంటూ వచ్చిందని నందు తెగ సంతోషపడిపోతాడు. ఎవరో నిన్ను ఆట పట్టించడానికి కాల్ చెయ్యలేదు కదా అని గాలి తీసేస్తుంది. ఆయన సంతోషంగా ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుందనే స్వార్థంతో చేశానని తులసి అనుకుంటుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంట్లో ముగ్గుల పోటీ పెట్టుకుంటారు.