వేద, యష్ తో అన్యోన్య దాంపత్య వ్రతం చేయిస్తారు రాజా, రాణి. కోనేటి స్నానం తర్వాత ఇద్దరూ కొత్త బట్టలు కట్టుకుని వస్తారు. అందులో ఇద్దరూ చాలా అందంగా కనిపిస్తారు. ఇద్దరూ ఒకరికొకరు బాగున్నారని కాంప్లిమెంట్ ఇచ్చుకుంటారు. పూజారి వేద, యష్ తో వ్రతం చేయిస్తాడు. పెళ్లినాటి ప్రమాణాలు చెప్పించి, ఇద్దరి కొంగు ముడి వేస్తాడు పూజారి. ఈ కొంగు ముడి బ్రహ్మ ముడి, ఇద్దరినీ ఒకటిగా చేసే అన్యోన్య దాంపత్య బంధం అని రాజా చెప్తాడు. ఇద్దరూ కలిసి ఏడడుగులు వేసి స్వామివారికి దణ్ణం పెట్టుకుంటారు. ఏడడుగులు వేస్తూ ఇద్దరూ చాలా మురిసిపోతారు.


Also Read: మల్లిక పప్పులు ఉడకలేదు- కష్టాల్లో భర్తకి తోడుగా నిలిచిన జానకి


మొదటి అడుగు శక్తి కోసం, రెండో అడుగు బలం కోసం, మూడో అడుగు వ్రతం కోసం, నాలుగో అడుగు ఆనందం కోసం, ఐదో అడుగు ఇంద్రియ బలం కోసం, ఆరో అడుగు రుతువుల కోసం, ఏడో అడుగు గృహధర్మం కోసం అని రాజా చెప్తాడు. భార్యాభర్త ఇద్దరూ ఒకరికొకరు కలిసి కలకాలం ఉంటామని పవిత్ర ప్రమాణం ఇదేనని రాణి చక్కగా చెప్తుంది. ఇద్దరూ  నిర్విగ్నంగా పూజ పూర్తి చేస్తారు. ‘నా మనసుకు అయిన గాయంతో నేను బాధలో ఉన్న సమయంలో నాకు అండగా నిలబడింది తను. నా కోసం అన్ని రకాల త్యాగాలు చేసింది. కానీ మేము దానికి రాసుకున్న పేరు ఒప్పందం. ఈ మధ్య జరిగిన సంఘటనల వల్ల నాకు మా మధ్య ఉంది ఒప్పందం కాదని భార్యాభర్తల బంధం అని అర్థం అయ్యింది. ఈరోజు నేను చేసిన వ్రతం మొక్కుబడిగా ఎవరికోసమే చేయలేదు. వేదని భార్యగా మనస్పూర్తిగా ఇష్టపడుతున్నా. మనసులో మాటని ఎలా చెప్పగలను. నేను తన ప్రేమ కోసం ఎదురుచూస్తున్నా. ఎందుకంటే వేద అంటే నాకు ఇష్టం’ అని యష్ మనసులో అనుకుంటాడు.


‘ప్రతి ఆడపిల్లకి భర్తతోనే జీవితం. నేను నా భర్తని మనస్పూర్తిగా ప్రేమిస్తున్నా. తనకి నేను దగ్గర అవ్వాలని అనుకుంటున్నా, ఈ విషయం ఆయనకి ఎలా చెప్పను’ అని వేద మనసులో అనుకుంటుంది. గుడిలో ఒక చోట వేద, యష్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.


యష్: మనం ఇద్దరం ఖుషి కోసం చేసుకున్న ఒక ఒప్పందం. కానీ పెద్ద వాళ్ళ ఆశీస్సులు దేవుడి దీవెన ఎప్పుడు లేనిది ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి నా మనసు కొత్తగా ఆలోచిస్తుంది. ఈ ఊరు వచ్చిన తర్వాత ఇక్కడి అభిమానాలు చూశాక నా మనసులో ఏదో అలజడి చెలరేగుతుంది. నీ మెడలో నేను కట్టిన తాళి మన మధ్య ఉన్నది ఒప్పందం మాత్రమే కాదు పవిత్రమైన భార్యాభర్తల బంధం. నువ్వు ఏమంటావ్ వేద


Also Read: వేద, యష్‌తో అన్యోన్య దాంపత్య వ్రతం చేయిస్తున్న రాజా- ఇద్దరు ఒక్కటి అవుతారా?


వేద: థాంక్స్ యశోధర్ గారు.. మీ మాట మీరు నిలబెట్టుకున్నారు. మనం ఏం చేసినా ఖుషి కోసం. ఈరోజు వ్రతం చేశాం, భార్యాభర్తలుగా వ్రతం చేశామని అమ్మమ్మ వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మనం ఖుషికి అమ్మానాన్నలుగా చేశాం. మనం ఏం చేసినా ఖుషికి అమ్మానాన్నగా చేస్తాం. ఈ వ్రత ఫలం వల్ల ఖుషికి మేలు జరుగుతుంది. మనకి కావలసింది అదే కదా. మన ఇద్దరి మధ్య పెళ్లి ఒప్పందం అదే కదా (మనసులో మీరు ఆట పట్టించాలని కొత్త నాటకం మొదలు పెట్టారు. ఈ మాత్రం తెలివితేటలు నాకు ఉన్నాయి. ప్రతీసారి ఫూల్ ని కాలేను అని యష్ మాటలు నమ్మదు)


ఆ మాటకి యష్ మనసు ముక్కలవుతుంది. మా ఇద్దరి మధ్య ఈ దాగుడు మూతలు ఎన్నాళ్ళు. ఆయన మనసు నేను అర్థం చేసుకోవడం లేదా’ అని ఆలోచిస్తూ ఉంటుంది. రాణి వేద వాళ్ళకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తుంది.