వేద, యష్ గొడవపడుతున్నారని వాళ్ళని కలపడం కోసం ఖుషి డిన్నర్ పార్టీకి వెళ్దామని అడుగుతుంది. దీంతో సరే అని ముగ్గురు కలిసి రెస్టారెంట్ కి వెళతారు. వాళ్ళని నవ్వించడానికి ఖుషి ట్రై చేస్తుంది. యష్ కి ఇష్టంగా తినవేవి ఆర్డర్ చెయ్యమని ఖుషి చెప్తుంది. దీంతో వేద యష్ కి నచ్చినవే తీసుకురమ్మని చెప్తుంది. ఖుషి వాళ్ళ మూడ్ మార్చేందుకు ఒక గేమ్ ఆడదామని చెప్తుంది. వేద గురించి యష్ ని , యష్ గురించి వేదని క్వశ్చన్స్ చేస్తానని ఖుషి చెప్తుంది. అమ్మకి ఇష్టమైన కలర్ ఏంటి అని ఖుషి యష్ ని అడుగుతుంది. ఏ కలర్ చెప్పాలో తెలియక తనకి తెలియదని అంటాడు.


తర్వాత ఖుషి వేదని నాన్నకి ఎవరంటే ఇష్టం అని అడుగుతుంది. పిల్లలు ఖుషి, ఆదిత్య అంటేనే ఇష్టమని చెప్తుంది. మరి ఎవరంటే కోపం అంటే మీ నాన్నకి నేనంటేనే కోపం అని మూతి తిప్పుతుంది. కానీ యష్ మాత్రం తనకి వేద మీద కోపం లేదని చెప్తాడు. యష్ వేదకి సోరి చెప్తే వేద భర్తకి థాంక్స్ చెప్తుంది. ఇంతలో ఫుడ్ వచ్చేసరికి ఎవరికి వారు తినబోతుంటే అలా కాదని ఒకరికొకరు తినిపించుకొని తనకి తినిపించమని అడుగుతుంది. దీంతో వేద, యష్ ఒకరికొకరు తినిపించుకుంటారు. రెస్టారెంట్ లో మ్యూజిక్ స్టార్ అవుతుంది. ఖుషి వెళ్ళి మైక్ అందుకుని తన అమ్మానాన్న గురించి చెప్తానని అంటుంది.


Also Read: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు


అమ్మానాన్నకి తనంటే బోలెడు ఇష్టమని చెప్తుంది. అలాంటి అమ్మానాన్న ఉన్నందుకు తను చాలా లక్కీ అని అంటుంది. తన కోసం వాళ్ళు ఏమైనా చేస్తారని అందుకే వాళ్ళంటే చాలా ఇష్టమని చెప్తుంది. ‘ఏదైనా బాగా పెరగాలంటే రైన్, సన్ షైన్ అవసరం అంట, నాకు రైన్ మా నాన్న, సన్ షైన్ మా అమ్మ. మమ్మీ ఐదు అక్షరాలు, డాడీ అంటే అయిదక్షరాలు. మా అమ్మానాన్న అంతే పంచ ప్రాణాలు. నాకు పెద్దదాన్ని అవడం ఇష్టం లేదు చిన్న పిల్లలాగే ఉండాలని ఉంది. అలా ఉంటే అమ్మనాన్నతో బాగా ఆడుకోవచ్చు కదా. ఇప్పుడు మీ అందరికీ ఒక సర్ ప్రైజ్ ణా కోసం మా అమ్మానాన్న డాన్స్ చేస్తారు’ అని మైక్ లో చెప్తారు.


వేద, యష్ వద్దని అంటుంటే ఖుషి మాత్రం చేయాల్సిందే అని మారాం చేస్తుంది. దీంతో చేసేది ఏమి లేక వేద, యష్ డాన్స్ చేస్తారు. ఇద్దరి చూపులు కలుస్తూ చాలా రొమాంటిక్ గా డాన్స్ ఆనందంగా ఉంటారు. మాలిని, రత్నం.. వేద వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే ఖుషి సంబరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. అమ్మానాన్న ఇద్దరూ కలిసి పార్టీలో డాన్స్ చేశారని, వాళ్ళిద్దరూ ఇప్పుడు కటీఫ్ కాదని సంతోషంగా అంటుంది. అది విని మాలిని హ్యపీగా ఫీల్ అవుతుంది.


Also Read: హ్యాపీగా ఎంజాయ్ చేసిన రామా, జానకి- కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, మల్లిక టెన్షన్ టెన్షన్


తరువాయి భాగంలో..


స్కూల్ దగ్గర ఆదిత్య డ్రైవర్ ని కారు కీస్ ఇవ్వమని బలవంతంగా తీసుకుని కారు డ్రైవ్ చెయ్యడానికి వెళ్లబోతుంటే వేద ఆపుతుంది. కీస్ ఇవ్వమని అడుగుతుంది కానీ ఆదిత్య ఇవ్వకపోయేసరికి చెంప పగలగొడుతుంది. ఆ కారు డ్రైవర్ వెంటనే వేద దగ్గరకి వచ్చి ఈ చెంప దెబ్బ వాళ్ళ అమ్మ ఎప్పుడో కొట్టి ఉంటే ఆదిత్య బాబు ఎప్పుడో మారిపోయేవాడు. మీ అమ్మగారికి యాక్సిడెంట్ చేసింది మాళవిక కాదు ఆదిత్య అనే విషయం డ్రైవర్ వేదకి చెప్తాడు.