తులసి తొలిజీతం తీసుకున్న తర్వాత సామ్రాట్‌తో చిన్న ఛాలెంజ్ విసురుతుంది. గృహిణిగా బాధ్యతలు చేయడం చాలా సులువు అనేసరికి సరే అయితే ఒక్కరోజు గృహిణిగా చెయ్యమని చెప్తుంది. ఒక్కరోజు తులసిలా మారిపొమ్మని చెప్తుంది. డబ్బులు ఖర్చు, ఆదా ఎలా చెయ్యాలో తులసి సామ్రాట్ కి చిన్న క్లాస్ తీసుకుంటుంది. అదంతా విన్న సామ్రాట్ తులసిని తెగ పొగిడేస్తాడు. ఆదా చేసిన డబ్బు ఏం చేస్తారని సామ్రాట్ అడుగుతాడు. నందుకి ఉద్యోగం లేదని సంసార బాధ్యతలు మోయాలని అనుకుంటాడు కానీ డబ్బులు ఉండవు కదా అందుకే నా పిల్లలకి అవసరాలు తీర్చడానికి ఇస్తానని చెప్తుంది. విడాకులు తీసుకున్నా కూడా మీ కుటుంబం గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నారని సామ్రాట్ మళ్ళీ పులిహార కలిపేస్తాడు.
ఇక తులసి పిల్లల కోసం షాపింగ్ చెయ్యడానికి బయటకి వెళ్లాలని అంటే తను కూడా వస్తానని అంటాడు. బస్సులో వెళ్ళాలి అని తులసి చెప్పేసరికి అయినా సరే వస్తాను అని చెప్తాడు. అంకిత, శ్రుతి కిచెన్ లో వంటకి ప్రిపేర్ చేస్తూ ఉంటే లాస్య వస్తుంది. ఇద్దరూ కలిసి కాసేపు లాస్యని ఆడుకుంటారు. ఈ పూట ఇంట్లో అందరికీ తనే వంట చేసి పెడతాను అని లాస్య అంటుంది. ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో వంట చెయ్యాలని లిస్ట్ తోడికోడళ్ళు ఇద్దరూ కలిసి పెద్ద లిస్ట్ చెప్పేస్తారు. అది విని ఇది ఇల్లా రెస్టారెంటా నేను వండను అని చేతులెత్తేస్తుంది. భాగ్య వచ్చి అదంతా చూసి తోడికోడళ్ళు లాస్యని బాగానే ఆడుకుంటున్నారు, కానీ తనకే అది అర్థం కావడం లేదని మనసులో అనుకుంటుంది.
Also Read: నిజం తెలిసి ఆదిత్యని జైలుకి పంపించేందుకు ప్లాన్ వేసిన అభిమన్యు- ఖుషి మీద అరిచిన యష్
అంకిత వాళ్ళ మాటలు విన్న లాస్య వంట చెయ్యను మీ పాట్లు పడండి అని అంటుంది. అదేంటి ఇప్పటి వరకి నీకు తులసి ఆంటీ అడ్డుపడుతుందని అంటావ్ కదా ఇప్పుడు నువ్వు కిచెన్ లో తులసి ఆంటీ ప్లేస్ తీసుకోకుండా పారిపోతావ్ ఏంటి అని అంకిత కౌంటర్ ఇస్తుంది. తులసికి ఓపిక ఎక్కువ అందరి దగ్గర మార్కులు కొట్టేయాలనే ఆత్రం ఎక్కువ భాగ్య ఎంట్రీ ఇస్తుంది. తులసి, సామ్రాట్ రోడ్డు మీద బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సామ్రాట్ డ్రెస్ చూసి తులసి పగలబడి నవ్వుతుంది. మిడిల్ క్లాస్ కుర్రోడిలా కనిపిస్తున్నాన అని ఆత్రంగా అడుగుతాడు. కాదులే మిడిల్ క్లాస్ అంకుల్ అని అననులే మీకిష్టం లేదు కదా అని అంటుంది. ఛాలెంజ్ లో గెలవాలని గట్టిగా అనుకుంటున్నారే అని తులసి అంటుంది.
బస్టాండ్ లో ఒక వ్యక్తి వచ్చి నిలబడితే క్యూలో ఉండాలి అని అమాయకంగా వాదిస్తాడు. ఇది ఫ్లైట్ కాదు క్యూ ఉండటానికి బస్సు ఎక్కేటప్పుడు ఎవరు ముందు ఎక్కితే వాడే రాజు అని మళ్ళీ క్లాస్ తీసుకుంటుంది. బస్సు రాగానే అందరూ సామ్రాట్ ని తోసేసి బస్సు ఎక్కేస్తారు. తులసి కూడా ఎక్కుతుంది కానీ సామ్రాట్ ఎక్కలేక తులసి తులసి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇలా అయితే షాపింగ్ కి వెళ్ళినట్టే అని బస్సు ఎక్కడానికి కూడా ట్రైనింగ్ తీసుకోవాలి ఏమో అని అనుకుంటాడు. మళ్ళీ ఇంకొక బస్సు రాగానే సామ్రాట్ అందరినీ తోసేసి మరి ఎక్కేస్తాడు. భాగ్య వచ్చి పరంధామయ్యని పలకరిస్తుంది. భాగ్యకి బాగా కౌంటర్లు వేసి గాలి తీస్తాడు. బస్సు ఎక్కేసరికి అదేదో ఎవరెస్టు పర్వతం ఎక్కినట్టు సామ్రాట్ బిల్డప్ కొడతాడు.
Also Read: హ్యాపీగా ఎంజాయ్ చేసిన రామా, జానకి- కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, మల్లిక టెన్షన్ టెన్షన్