ఏంటే కంచు ఇంత మంచి శుభవార్త ఈ అమ్మతో కూడా చెప్పాలని అనిపించలేదా అని మాలిని బాధగా అడిగితే మేమంతా పరాయి వాళ్ళం అయిపోయామా అని రత్నం అంటాడు. అక్క ఏ క్షణంలో అయినా నీకు అండగా ఉంటాను అని మాట ఇచ్చాను కనీసం నాకు అయిన ఎందుకు చెప్పలేడు ఇప్పుడైనా మాట్లాడు అని యష్ అనేసరిక ఎందుకు చెప్పాలి యష్ అని కాంచన కోపంగా బాధగా అరుస్తుంది. 'నా భర్త మీద నింద వేసి మీరంతా జైలుకి పంపించినప్పుడు నాకు నా భర్తకి పుట్టబోయే బిడ్డ గురించి అసలు ఎందుకు చెప్పాలి. పుట్టింట్లో ఏ ఆడదానికైనా బలం అంటారు.. కానీ నాకు మాత్రం నా కన్నిటికి కష్టానికి కారణమైంది.. ఇలాంటి ఇంట్లో ఈ సంతోషకరమైన విషయం ఎలా చెప్పాలని అనిపిస్తుంది. నా భర్త మీద కోపం ఉన్నప్పుడు నా మీద ఎంత ప్రేమ అభిమానం చూపించినా అది నాకు శాపంలాగే అనిపిస్తుంది. ఆయన అరెస్ట్ అయిన రోజు నుంచి నేను బాధపడాని క్షణం లేదు విడిపించమని బ్రతిమలాడని రోజు లేదు కానీ మీలో ఒక్కరైనా పట్టించుకున్నారా నా బాధ్యలో నన్ను వదిలేసి మీ సంతోషంలో మీరు ఉన్నారు' అని కాంచన ఆవేదనగా మాట్లాడుతుంది. వదిలేయడం ఏంటి కంచు నేను ఎప్పటికప్పుడు నీ దగ్గరకి వచ్చి మాట్లాడి నీ మూడ్ మార్చడానికి చూస్తున్నా కదా అని మాలిని అంటే నాకు కావలసింది నాదగ్గరకి వచ్చి మాట్లాడటం కాదమ్మా నా సమస్యకి పరిష్కారం చూపించడం నా కన్నీళ్ళు మీకు లెక్కలేనప్పుడు సంతోషాన్ని పంచుకోవాలని అనిపించలేదు అందుకే ఆయన ఒక్కడితోనే పంచుకున్నాను. నన్ను నా భర్తని వేరుగా చూస్తున్నారు, అయినా మేము ఇద్దరం ఒక్కటే. ఆయన అంటే నాకు ప్రాణం. ఆయన కష్టంలో ఉంటే నేను సంతోషంగా ఉండలేను నవ్వుతూ నేను నటించలేను, నా జీవితంలో ఏ మంచి అయినా శుభం అయినా ఆయన బయటికి వచ్చిన తర్వాతే అనేసి ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.


Also Read: కాంచన గురించి ఇంట్లో చెప్పి మంట పెట్టిన మాళవిక- ఖైలాష్ ని యష్ విడిపిస్తాడా?


కాంచన మాటలకి ఇంట్లో అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. మాళవిక సంతోషంగా అభి దగ్గరకి వస్తుంది. ఏంటి బంగారం నువ్వు వేసిన బాంబ్ సక్సెస్ అయ్యిందా అని అడుగుతాడు. మామూలుగా కాదు సూపర్ గా నేను మాట్లాడుతుంటే నా మాజీ మొగుడు మొట్ట మొదటి సారి తల దించుకుని విన్నాడని సంబరంగా చెప్తుంది. యష్ కాంచన మాటలు తలుచుకుంటూ బాధపడతాడు. అక్క అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం తనకి ఈ లోటు రాకుండా చూసుకోవాలని అనుకున్నాం.. కానీ అక్క మాత్రం మాతో సంతోషంగా పంచుకోవాల్సిన విషయం మూడో వ్యక్తికి చెప్పి సమస్యగా మార్చిందని అంటాడు. ఖైలాష్ మీద మనకున్న కోపం మీ అక్క మనసులో మనమీద ద్వేషంగా మారిపోయింది. అందుకే మనకన్నా భర్తే ఎక్కువ అయ్యాడని వేద చెప్తుంది. కానీ వాడికి చెప్పడం వల్లే కదా మాళవిక ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది తప్పు మనవైపు ఉంది కాబట్టి గుండెల్లో కోపాన్ని గొంతులోనే అణుచుకోవాలని అనుకుంటుంది. తనకి మంచి జరగాలని కోరుకునే మన దగ్గర ఈవిషయం దాచడం ఏంటి అక్క దాచిన రహస్యానికి మనకంటే అమ్మే ఎక్కువ బాధపడుతుంది. మాగురించి మర్చిపోయినా అమ్మ గురించి ఆలోచించవచ్చు కదా అని యష్ అంటాడు. భర్తని ప్రేమించడం తప్ప వేరే ఏమి తెలియని అమాయకురాలు కాంచన, ప్రెగ్నెన్సి విషయం మనకి చెప్పకపోవడానికి మన మీద ఉన్న కోపం కన్నా భర్త మీద తనకున్న ప్రేమే కారణం. అందుకే ఈ విషయంలో కాంచన పొరపాటు కన్నా పరిస్థితుల ప్రభావమే నాకు కనిపిస్తుందని అంటుంది.


రంగుల మార్చే గుణం ఉన్న ఆ ఖైలాష్ ని ఇంద్రధనస్సు అని నమ్మడం అక్క చేస్తున్న అతి పెద్ద పొరపాటు. తన అమాయకత్వాన్ని తలుచుకుంటే ఖైలాష్ మీద వచ్చే కోపం కన్నా అక్క జీవితం ఏమైపోతుందో అనే బాధే ఎక్కువగా ఉందని అంటాడు. ఒక్కోసారి మనకి తెలియని సమస్యకి కామే పరిష్కారం చూపిస్తుందని వేద ధైర్యం చెప్తుంది. యష్ కాంచన దగ్గరకి వచ్చి మాట్లాడతాడు. నా కష్టానికి కన్నిటికి కారణమైన నువ్వు నన్ను ఎలా కంటికి రెప్పలా చూసుకుంటావ్ యష్ అని కాంచన ఏడుస్తూ అడుగుతుంది. నేను కారణం కాదక్కా నన్ను అపార్థం చేసుకొకు తప్పు చేసిన వాడికి శిక్ష పడిందని అంటాడు. నా భర్త నా పక్కన లేకుండా చేశారు మీరందరూ ఇటువంటి సమయంలో నాకు నా భర్త పక్కన ఉండాలి ఆయన పంచే ప్రేమ వేరు పశ్చాత్తాపంగా అనిపిస్తే వెళ్ళి ఆయన్ని విడిపించు, నీలాంటి వాడికి అక్క, కుటుంబం కంటే ఆ వేదనే ఎక్కవ, అక్క అంటే ప్రేమ కాదు తన ప్రాణం పోయినా పట్టించుకోవని కాంచన అనేసి వెళ్ళిపోతుంది.


Also Read: నీ మనసులో నా స్థానం ఏంటని ఆదిత్యని నిలదీసిన సత్య- తన బతుకులో తన పెనిమిటే ఉన్నాడని మాధవకి వార్నింగ్ ఇచ్చిన రుక్మిణి


మాలిని కాంచన గురించి ఏడుస్తూ ఉంటుంది. ఎంత కోపం ఉన్నా ఈ తల్లికి కూడా చెప్పకుండా ఉంటుందా.. తల్లి కావడం ఒక వారం అది తన నోటి నుంచి వినాలని ఈ తల్లి మనసు ఎంత ఆరాటపడుతుందో తెలుసా ఆ సంతోషం లేకుండా చేసింది కంచు, ఇప్పటికీ దాన్ని చిన్నపిల్లలగా చూస్తూ ఉంటాను. అయినా నా తల్లి ప్రేమ దానికి ఎందుకు కనిపించడం లేదని మాలిని బాధపడుతుంది. భర్త మీద ఉన్న ప్రేమ మంచి చెడులని కూడా గుర్తించలేకపోతుందని రత్నం అంటాడు. మాలిని వేద దగ్గరకి వస్తుంది. కడుపుతో ఉన్న నా కూతురు కష్టాన్ని, కన్నీటిని తుడవగలిగేది నువ్వు ఒక్కదానివే.. ఎవ్వరూ చేయలేని సాయం ఇది. జరిగిన విషయంలో ఖైలాష్  ఎంత శిక్ష అనుభవిస్తున్నాడో భర్తని తలుచుకుని అంతకంటే పెద్ద శిక్ష అనుభవిస్తుంది. ఖైలాష్ మీద పెట్టిన కేసు విత్ డ్రా చేసుకో అని మాలిని అడుగుతుంది. ఆయనకి ఇష్టం లేదని వేద అంటుంది. ఈ విషయంలో యష్ భార్యగా కాకుండా కూతురు కష్టం చూడలేని ఒక తల్లిగా నా స్థానంలోకి వచ్చి ఆలోచించు నా బాధ అర్థం అవుతుంది. ఖైలాష్ శిక్ష ఎప్పుడు పూర్తవుతుందో అప్పటిదాకా కంచు ఎడుస్తానే ఉంటుంది. తల్లి అయినా తండ్రి అయినా కన్న వాళ్ళు లేని లోటు పసిబిడ్డలకు ఎవరు తీర్చలేరు. ఆ విషయం నెలల వయసులో ఉన్న మా ఖుషిని మాళవిక వదిలి వెళ్ళినప్పుడు మా అందరికీ బాగా అర్థం అయ్యింది. ఆ పరిస్థితి కంచు పిల్లలకి రాకుండా ఉండాలని నిన్ను అడుగుతున్నాను. వాళ్ళిద్దరూ మనకి దరూయమగా ఎక్కడికైనా వెళ్ళి బతుకుతారు. నీ ఆడపడుచుని కన్నీటి నుంచి తప్పించు, మా కోసం ఖైలాష్  మీద పెట్టిన కేసు విత్ డ్రా చేసుకో అని మాలిని బతిమలాడుతుంది. తల్లిగా మీ బాధని అర్థం చేసుకోగలను కానీ భర్త మాట దాటలేను అని వేద చెప్తుంది. ఎప్పుడు లేనిది నేను నీ దగ్గరకి బతిమలాడితే నువ్వు ఇచ్చే సమాధానం ఇదేనా, అని మాలిని చేతులెత్తి దణ్ణం పెట్టి కేసు వెనక్కి తీసుకోమని అడుగుతుంది కానీ వేద అందుకు ఒప్పుకోదు. ఈ మాటలన్నీ యష్ వింటూ ఉంటాడు.


తరువాయి భాగంలో..


కాంచన ఆత్మహత్యాయత్నం చేయబోతుంటే వేద ఛీ ఆపుతుంది. ఏంటి వదినా ఈ పిచ్చి పని ఇంకెప్పుడు ఇలా చేయనని నాకు మాట ఇవ్వు అని వేద కంచుని అడుగుతుంది. మాట ఇస్తాను వేద కానీ నా భర్తని నాకు తిరిగి ఇస్తావా అని కాంచన అడుగుతుంది.