లయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ ‘కింగ్ ఆఫ్‌ కోథ’. అభిలాష్ జోషి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఓనమ్‌ కానుకగా విడుదల చేయనున్నారు.  గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన  ఫస్ట్‌ లుక్‌‌, మోషన్‌ పోస్టర్‌, టీజర్‌ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది.  ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్  అదిరిపోయింది.


దుమ్మురేపుతున్న‘కింగ్ ఆఫ్‌ కోథ’ ట్రైలర్‌


ముందుగా ‘కింగ్ ఆఫ్‌ కోథ’ ట్రైలర్‌ లోడింగ్‌.. బ్లాస్టింగ్‌కు రెడీనా? అంటూ మేకర్స్‌ ముందుగా ఓ వీడియో విడుదల చేశారు. అనుకున్నట్లుగానే తాజాగా ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో బ్లాస్టింగ్ సృష్టించింది. ఇప్పటికే విడుదలైన టీజర్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నాయి.  “రాజు రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారనే డైలాగ్తో షురూ అయిన టీజర్‌లో, తమ భూమిని కాపాడే రాజు అతనొక్కడేనని ఆ ప్రజలు నమ్ముతున్నారు”  అంటూ దుల్కర్ సల్మాన్‌ క్యారెక్టరైజేషన్‌ గురించి క్యూరియాసిటీని పెంచాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ తో దుమ్మురేపింది. ‘కోథ’ అనే ప్రాంతం చుట్టూ ఈ సినిమా తిరుగుతోంది. ‘‘సొంత యజమానికి చూసిన కుక్కలాంటిది ఈ కోథా, ముందు అరుస్తుంది. తర్వాత తోక ఊపుకుంటూ వస్తుంది. తర్వాత కాళ్ల దగ్గర పడి ఉంటుంది’’ అనే డైలాగ్‌‌కు విజిల్స్ పడటం ఖాయం. దుల్కర్ సల్మాన్ ఓ దాదా కొడుకుగా కనిపిస్తున్నాడు. తన తండ్రి మాదిరిగానే ఓ రౌడీ కావాలని పనీపాటా లేకుండా తిరుగుతుంటారు. చివరకు రౌడీలా మారుతాడు. కోథ ప్రాంతం మీద కొంతమంది వ్యాపారవేత్తలు, ఇతర రౌడీల కన్నుపడుతుంది. వాళ్ల నుంచి కోథ ప్రాంతాన్ని హీరో ఎలా కాపాడుతాడు అనేది ఈ సినిమా స్టోరీగా తెలుస్తోంది.



ఇక ‘కింగ్ ఆఫ్‌ కోథ’ చిత్రాన్ని వేఫరెర్‌ ఫిలిమ్స్,  జీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి షాన్ రెహ్మాన్‌, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉషా, చెంబన్ వినోద్‌, గోకుల్ సురేశ్‌, షమ్మీ తిలకన్‌, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్‌, అనిఖా సురేంద్రన్‌  కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.  మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఓనమ్‌  కానుకగా విడుదల చేయనున్నారు.


డైరెక్టర్ సిద్దిఖీ మృతితో ట్రైలర్‌ లాంఛింగ్‌ వాయిదా


నిజానికి  ‘కింగ్ ఆఫ్‌ కోథ’ మూవీ ట్రైలర్ నిన్న(ఆగష్టు 9)న విడుదల కావాల్సి ఉంది. కానీ, మాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్దిఖీ మరణంతో ట్రైలర్‌ లాంఛింగ్‌ను మేకర్స్‌ వాయిదా వేశారు. “సిద్దిఖీ గారి ఆకస్మిక మరణంతో ‘కింగ్ ఆఫ్‌ కోథ’ ట్రైలర్‌ లాంచ్ వాయిదా వేశాం. ఆయనకు కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం”  అని నిర్మాతలు వెల్లడించారు. 


Read Also: 20 ఏళ్ల క్రితం కమల్ దగ్గర బాగా డబ్బులుండేవి, అప్పుడే ఓ సలహా ఇచ్చా - ఏఆర్ రెహమాన్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial