Mega Millions Jackpot: ఫ్లోరిడా మెగా మిలియన్స్ లాటరీలో ఓ వ్యక్తి అదిరిపోయే జాక్ పాట్ కొట్టేశాడు. సుమారు రూ.13 వేల కోట్ల గెలుచుకున్నాడు. నెఫ్యూన్ బీచ్ లోని పబ్లిక్స్ స్టోర్ నిర్వాహకులు ఈ టికెట్ ను విక్రయించారు. లాటరీ నిర్వాహకులు మంగళవారం రోజు డ్రా తీశారు. అందులో 13, 19, 20, 32, 33, 14 నెంబర్ టికెట్ కు ఈ లాటరీ వచ్చినట్లుగా మెగా మిలియన్స్ లాటరీ నిర్వాహకులు వెల్లడించారు. అమెరికా చరిత్రలో మూడో అతిపెద్ద లాటరీ ప్రైజ్ మనీ ఇదేనని అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. లాటరీలో గెలుపొందిన వ్యక్తికి... 1.58 మిలియన్ నగదును ఒకేసారి ఇవ్వరట. మొత్తంగా 30 సంవత్సరాల పాటు చెల్లిస్తారని తెలుస్తోంది. అలా కాకుండా మొత్తాన్ని ఒకేసారి పొందాలంటే వారికి సుమారు 783.3 మిలియన్ డాలర్ల అంటే రూ.6400 కోట్ల మాత్రమే వస్తాయట. సాధారణంగా ఎక్కువ మంది విజేతలు ఇలా ఒకేసారి తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. 


ఇలాంటి లాటరీ ప్రైజ్ మనీ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు టాక్స్ లు విధిస్తుంటాయి. మెగా మిలియన్ లాటరీ అమెరికా వ్యాప్తంగా 45 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీ, యూఎస్ వర్జిన్ ద్వీపాల్లో నిర్వహిస్తున్నారు. నెప్యూన్ బీచ్ అట్లాంటిక్ తీరం తూర్పు జాక్సన్ విల్లేకు 26 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఇక్కడ 7 వేల మంది నివసిస్తుంటారు. గతేడాది జులైలో ఇదే మెగా మిలియన్ డ్రాలో మరో వ్యక్తి 1.28 మిలియన్ డాలర్ల జాక్ పాట్ తగిలింది. తాగాజా ఇలినాయ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎవరో ఈ టిక్కెట్ కొన్నట్లు అప్పట్లో నిర్వాహకులు తెలిపారు. కాగా ఇప్పుడు అమెరికా లాటరీ చరిత్రలో ఇదే మూడో అతిపెద్ద ప్రైజ్ మనీ.


ఈ మధ్య యూపీ వ్యక్తికి తగిలిన లాటరీ


 యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ‘ఫాస్ట్‌ 5’ పేరిట నిర్వహించిన లాటరీలో ఉత్తరప్రదేశ్‌ వాసి మెగా ప్రైజ్‌ మనీ విజేతగా నిలిచాడు. ఉత్తరప్రదేశ్ చెందిన మొహమ్మద్‌ ఆదిల్‌ ఖాన్‌ దుబాయ్‌లోని ఒక రియల్‌ఎస్టేట్‌ సంస్థలో ఇంటీరియర్‌ డిజైన్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి లాటరీ టికెట్లు కొనడం అలవాటు. ఇటీవల యూఏఈ ‘ఫాస్ట్‌ 5’ పేరిట లాటరీ ప్రకటించింది. అందులో ఆదిల్ ఖాన్ ఓ టికెట్ కొనుగోలు చేశాడు. అంతే అదృష్టం వరించింది. ఆ మెగా ప్రైజ్‌ మనీ డ్రాలో మొదటి విజేతగా నిలిచాడు. గురువారం నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. విజేతకు నెలకు 25,000 దిర్హమ్‌లు (భారత కరెన్నీలో రూ.5,59,822) చొప్పున 25 ఏళ్లపాటు ఇవ్వనున్నారు.


విజేతగా నిలవడంపై ఆదిల్‌ ఖాన్‌ ఆనందం వ్యక్తం చేశాడు. డ్రాలో విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. తన కుటుంబానికి తానే ఏకైక జీవనాధారమని కన్నీళ్లతో చెప్పాడు. కరోనా విజృంభన సమయంలో తన సోదరుడు చనిపోయాడని, అతడి కుటుంబాన్నీ తానే పోషిస్తున్నట్లు వివరించాడు. తనకు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఐదేళ్ల పాప ఉందని, ఇలాంటి సమయంలో లాటరీ తగలడం తన అదృష్టమన్నాడు. తాను లాటరీ గెలిచానని ఇంట్లో చెప్పినప్పుడు తన కుటుంబం తొలుత నమ్మలేదన్నాడు. ఆ వార్త నిజమో లేదో తెలుసుకోవడానికి ఒకటికి రెండుసార్లు సరిచూసుకోమని చెప్పారని అన్నారు. ఇప్పటికీ లాటరీ తగిలిన విషయం ఒక కలలా ఉందని, ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానని ఆనందం వ్యక్తం చేశాడు.