Just In





Drishyam 2: 'దృశ్యం2' ట్రైలర్ - మక్కీకి మక్కీ దించేశారుగా!
'దృశ్యం2' ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

మలయాళంలో మోహన్ లాల్(Mohan lal), మీనా(Meena) జంటగా నటించిన 'దృశ్యం2'(Drishyam2) సినిమా సూపర్ హిట్ అయింది. ఓటీటీలో విడుదలైనప్పటికీ భారీ వ్యూస్ ను రాబట్టింది. దాన్ని తెలుగులో 'దృశ్యం2 పేరుతోనే రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు హిందీ రీమేక్ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
Drishyam 2: Trailer Of Ajay Devgn And Tabu's Film: ట్రైలర్ ను చూస్తుంటే ఒరిజినల్ ని మక్కీకి మక్కీ దించేసినట్లుగా అనిపిస్తుంది. తెలిసిన స్టోరీ అయినప్పటికీ.. థ్రిల్లింగ్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. టేకింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ మరో అసెట్ అయ్యేలా ఉంది. అజయ్ దేవగన్, శ్రియా తన పాత్రల్లో జీవించేశారు. టబు తన టెరిఫిక్ పెర్ఫార్మన్స్ తో మెస్మరైజ్ చేసేలా ఉంది. మిగిలిన భాషల్లో ఆల్రెడీ సినిమాను చూసేశారు కాబట్టి హిందీ వెర్షన్ పై పెద్దగా ఫోకస్ చేసే ఛాన్స్ లేదు. కనీసం హిందీ ఆడియన్స్ ను ఈ సినిమా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, మీనా నటించిన 'దృశ్యం' కేరళలో ఘన విజయం సాధించింది. తర్వాత ఆ సినిమా తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగణ్ (Ajay Devgan) రీమేక్ చేశారు. ఇంకా పలు భాషల్లో రీమేక్ అయింది. ప్రతి చోట విజయం సాధించింది. 'దృశ్యం'కి సీక్వెల్‌గా 'దృశ్యం 2' చేశారు మోహన్ లాల్. తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశారు. ఆ రెండూ ఓటీటీలోకి వచ్చేశాయి. ఇప్పుడు అజయ్ దేవగన్ 'దృశ్యం2' రిలీజ్ కు సిద్ధమవుతోంది.
హిందీలో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్ (Shriya Saran) భార్యాభర్తలుగా... టబు, అక్షయ్ ఖన్నా, ఇషితా దత్తా కీలక పాత్రల్లో నటించిన 'దృశ్యం 2' నవంబర్ లో విడుదల కానుంది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించగా.. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు.
Read Also: పెళ్లికూతురుగా కీర్తి సురేష్ - బర్త్‌డే గిఫ్ట్ అదుర్స్, బరాత్‌లో మహానటి రచ్చ!