తెలంగాణ ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పోలీసు నియామక మండలి ఊరటనిచ్చే వార్త తెలిపింది. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకపోతే ఈ వారంలోనే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఎస్సై, కానిస్టేబుల్ ప్రాథమిక కీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. ఫైనల్ కీతో పాటే ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు.
పోలీసు ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఫలితాలను సెప్టెంబరులోనే వెల్లడించాలని తొలుత పోలీసు నియామక మండలి నిర్ణయించింది. అయితే ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్ని తగ్గిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించడంతో ఫలితాల వెల్లడి ఆగిపోయింది. ఈక్రమంలో కటాఫ్ మార్కులను బీసీ అభ్యర్థులు 25 శాతం (50 మార్కులు); ఎస్సీ, ఎస్టీ లేదా ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 20 శాతం (40) మార్కులు సాధిస్తే అర్హత సాధిస్తారని పోలీసు నియామక మండలి అక్టోబరు 2న ఉత్తర్వులు విడుదల చేసింది. ఓసీ అభ్యర్థుల కటాఫ్ మార్కులను యథాతథంగా 30 శాతం(60 మార్కులు)గానే ఉంచాలని నిర్ణయించింది. ఈ ఉత్తర్వులతో తగ్గించిన కటాఫ్ మార్కులకు అనుగుణంగా ఫలితాల వెల్లడిపై మండలి కసరత్తు చేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్‌ఐ పోస్టులకు ఆగస్టు 7న, అలాగే 16,321 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆగస్టు 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎస్‌ఐ రాతపరీక్షకు 2,47,217 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,25,759 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక కానిస్టేబుల్ పరీక్షకు మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
నవంబరులో ఫిజికల్ టెస్టులు...
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫలితాల్లో అర్హత సాధించే అభ్యర్థులకు నవంబరులో ఫిజికల్ ఎఫిషియెన్సీ, మెజర్‌మెంట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పంపించే లేఖల్లోనే వాటిని నిర్వహించే వేదిక, పరీక్ష తేదీ వివరాలను నియామక మండలి వెల్లడించనుంది.
ఈవెంట్లు ఇలా..
ఫిజికల్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులకు మొదట పరుగు పందెం నిర్వహిస్తారు. పురుషులు 1,600 మీటర్లు, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో పరుగు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో లాంగ్‌జంప్, షాట్‌పుట్ పోటీలు నిర్వహిస్తారు. వీటన్నింటిలోనూ అర్హత సాధిస్తేనే తుది రాతపరీక్షకు అర్హులుగా పరిగణిస్తారు. వీరికి మాత్రమే ఫైనల్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జారీ చేసి, పరీక్ష నిర్వహిస్తారు.
:: ఇవీ చదవండి ::
TSPSC: ఏఈఈ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు అక్టోబర్ 20 వరకు టీఎస్‌పీఎస్సీ పొడిగించింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు అక్టోబర్ 14తో ముగిసింది. అయితే గడువు పొడిగించాలంటూ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావటంతో సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ వెల్లడించింది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో లెక్చరర్ పోస్టుల దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఏపీలోని ఆయుష్ విభాగంలో హోమియోపతి, ఆయుర్వేద లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 7న ప్రారంభమైంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అక్టోబరు 21 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
RMLIMS: రామ్ మనోహర్ లోహియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్ పోస్టులు
లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
RMLIMS: రామ్ మనోహర్ లోహియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో 534 నాన్-టీచింగ్ పోస్టులు
లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..