Actress Ananthika Sanilkumar About Her Age: ప్రస్తుతం సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా రాణించాలంటే యాక్టింగ్ ఒక్కటే కాదు, అందాల ప్రదర్శన కూడా ముఖ్యమే. సినిమాలో ఆయా క్యారెక్టర్లకు అనుగుణంగా గ్లామర్ షో చేయడం తప్పనిసరి.  కొంత మంది హీరోయిన్లు మోడ్రన్ డ్రెస్సులలో మాత్రమే కాదు, చీరలోనూ అందంగా కనిపిస్తారు. అలాంటి ముద్దుగుమ్మలు సినిమా పరిశ్రమలో బాగా రాణిస్తారు. సినిమాల్లో చక్కటి క్యారెక్టర్స్ కూడా దొరుకుతాయి. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకుంటారు. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకు కాస్త దూరంగా ఉన్నా, మెల్లిగా ఓకే చెప్తుంటారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు అనంతిక సునిల్ కుమార్.  


‘మ్యాడ్’ సినిమాతో ఆకట్టుకున్న అనంతిక


‘మ్యాడ్’ సినిమాతో తెలుగు తెరపై మెరిసింది మలయాళ బ్యూటీ అనంతిక. నార్నే నితిన్ కు జోడీగా కనిపించి ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. నిజానికి ఈ ముద్దుగుమ్మ తెలుగులో తొలి సినిమాగా ‘రాజమండ్రి రోజ్ మిల్క్’ సినిమా చేయాల్సి ఉంది. అయితే, ఈ మూవీ కంటే తర్వాత తెరకెక్కిన ‘మ్యాడ్’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో  ‘మ్యాడ్ 2’ కూడా త్వరలో తెరకెక్కబోతోంది. ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతోంది అనంతిక.


‘లాల్ సలాం’ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ


అటు అనంతిక ‘లాల్ సలాం’ సినిమాతో తమిళ సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. రజనీకాంత్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో ఆమె చక్కటి పాత్ర పోషించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో అనంతిక గ్లామరస్ గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. క్యూట్ గా కనిపిస్తూనే అందాల ప్రదర్శనతో అలరించింది. తెలుగులోనూ ఈ ముద్దుగుమ్మకు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ‘మ్యాడ్’ సినిమాకు మించి గ్లామర్ రోల్స్ పోషించనున్నట్లు సమాచారం. మున్ముందు ఈ మలయాళీ బ్యూటీ టాలీవుడ్ లో ఎలాంటి అవకాశాలను అందుకుంటుందో వేచి చూడాల్సిందే.


అనంతిక వయసు ఎంతో తెలుసా?


తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి, తన సినిమాల గురించి కీలక విషయాలను వెల్లడించింది. ‘మ్యాడ్’ సినిమాతో తనకు మంచి గుర్తింపు లభించిందని వెల్లడించింది. తెలుగు నుంచి మరిన్ని అవకాశాలు లభిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, తాను ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు చెప్పింది. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు సినిమాల్లో రాణిస్తున్నట్లు వెల్లడించింది.   






ఇక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ‘మ్యాడ్’ సినిమాలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్  ప్రధాన పాత్రలు పోషించారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ సమర్పణలో హారిక, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.  


Read Also: ‘ఆపరేషన్ వాలెంటైన్’ ట్రైలర్: వరుణ్‌ను చూస్తే గర్వంగా ఉందన్న రామ్ చరణ్, ఆ సీన్స్ చూస్తే సెల్యూట్ చేస్తారు