Ananya Nagella Post on Tantra Release Date: ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టేందుకు అన‌న్య నాగెళ్ల సిద్ధమవుతోంది. ఇన్ని రోజులు గ్లామ‌ర‌స్, కూల్ క్యారెక్ట‌ర్స్ చేసిన ఈమె ఇప్పుడు హార‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆమె న‌టించిన హార‌ర్ సినిమా 'తంత్ర' మార్చి 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ విష‌యాన్ని హీరోయిన్ అనన్య స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించింది


మార్చి 12న థియేట‌ర్ల‌లోకి


"ఈ క్రతవుకు మీరు త‌ప్ప‌కుండా రావాలి.. మార్చి 15న థియేట‌ర్ల‌లో 'తంత్ర' అని అనే పోస్టర్‌ను పోస్ట్ చేసింది అన‌న్య‌. దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కుమారుడు ధనుష్‌ రఘుముద్రి హీరోగా పరిచయం అవుతున్న చిత్రమిది. దీంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. 






'మల్లేశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పదహారణాల అచ్చమైన తెలుగు అమ్మాయి అనన్యా నాగళ్ల . 'ప్లే బ్యాక్', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్‌ సాబ్‌' సినిమాలతో విజయాలు అందుకున్నారు. అచ్చ‌తెలుగు అమ్మాయిలా ఎన్నో పాత్ర‌లు చేశారు అన‌న్య. ఇప్పుడు 'తంత్ర' సినిమాతో కొత్తగా క‌నిపించ‌నున్నారు. అంద‌రినీ భ‌య‌పించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించి పోస్ట‌ర్లు, టీజ‌ర్లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ధనుష్‌ రఘుముద్రి ఎంట్రీ కావ‌డంతో.. ఆయ‌న న‌ట‌న ఎలా ఉండ‌బోతుందో అనే ఎక్సైట్ మెంట్ కూడా ఉంది సినీ అభిమానుల్లో. 


'కాలగర్భంలో కలసిపోయిన మన తాంత్రిక శాస్త్రాన్ని తెరిస్తే... అందులో ఊహకంద‌ని రహస్యాలు ఎన్నో' అంటూ  వ‌చ్చిన 'తంత్ర' టీజర్ ఆక‌ట్టుకుంది. ఆ ఊరిలో దుష్టశక్తి పుట్టిందని మరో గొంతు వినిపిస్తుంటే... తెరపై క్షుద్రపూజలు వంటివి కనిపించాయి. ఇక ఆ టీజ‌ర్ లో ప్ర‌తీ సీన్ భ‌య‌పెట్టేలా ఉంది. ఇక ఈ సినిమాలో అన‌న్య‌తో పాటు.. మ‌రో హీరోయిన్ క‌నిపించ‌నున్నారు. 'తంత్ర' సినిమాతో సలోని తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. గ్లామర్‌ రోల్స్ చేసి మెప్పించిన సలోని 'తంత్ర'లో డిఫరెంట్‌ గెటప్‌లో కనిపించ‌నున్నారు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో ఆమె కనిపిస్తార‌ని చిత్ర‌బృందం చెప్పింది. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలపై నరేష్ బాబు పి, రవి చైతన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక అనన్యా నాగళ్ల ఈ జానర్ సినిమా చేయడం కూడా ఇదే తొలిసారి. 
        
పురాణ గాథల నేపథ్యంలో 'తంత్ర'


'తంత్ర' ఫస్ట్ లుక్ కూడా వైవిధ్యంగా ఉంది. అందులో అనన్యా నాగళ్ల కన్ను ఒక్కటే కనబడుతోంది. కొన్ని చేతులు ఆమె ముఖాన్ని పట్టుకున్నట్లు ఉంది. మన 'తంత్ర' శాస్త్రానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలు ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నట్లు చిత్ర బృందం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. మహిళా ప్రాధాన్య చిత్రమిది. ఫిమేల్ ఓరియెంటెడ్ హారర్‌ ఎంటర్‌టైనర్‌. పురాణ  గాథలు, భారతీయ తాంత్రిక శాస్త్రం నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది.


Also Read: అనుపమా ఇలా చేస్తావనుకోలేదు - సావిత్రి, సౌందర్యలతో పోల్చుతూ అభిమాని ఆవేదన