Keerthy Suresh Marriage With Comedian Sathish: సినీ పరిశ్రమలో నటీనటులు పర్సనల్ లైఫ్ గురించి ఎప్పటికప్పుడు ఎన్నో రూమర్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా వారి రిలేషన్‌షిప్స్ గురించి నెటిజన్లు ఎప్పుడూ చర్చించుకుంటూనే ఉంటారు. ఒక హీరో, హీరోయిన్ సన్నిహితంగా కనిపిస్తే వారు రిలేషన్‌లో ఉన్నారని రూమర్స్ మొదలయిపోతాయి. అదే తరహాలో కీర్తి సురేశ్ పర్సనల్ లైఫ్‌పై కూడా పలుమార్లు పలు రూమర్స్ బయటికొచ్చాయి. ఒకానొక సందర్భంగా కీర్తి సురేశ్.. కమెడియన్‌ సతీష్‌ను పెళ్లి చేసుకుందని కూడా వార్తలు వచ్చాయి. అంతే కాకుండా వీరిద్దరి పెళ్లి అయిపోయిందంటూ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఫైనల్‌గా సతీష్.. ఈ విషయంపై స్పందించాడు.


స్పందించిన సతీష్..


కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించిన పలు చిత్రాల్లో సతీష్ కమెడియన్‌గా, హీరో ఫ్రెండ్‌గా కనిపించాడు. వీరిద్దరి పెళ్లి అయిపోయిందంటూ వస్తున్న రూమర్‌పై తను క్లారిటీ ఇచ్చాడు. సతీష్, కీర్తి కలిసి నటించిన చిత్రాల్లో ‘భైరవ’ కూడా ఒకటి. అందులో విజయ్ హీరోగా నటించగా తనకు జంటగా కీర్తి సురేశ్ కనిపించింది. సతీష్ కూడా ఒక చిన్న రోల్‌లో అలరించాడు. ఆ సినిమా సమయంలో ఒక పూజ జరిగిందని అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు సతీష్. ఆ పూజ కోసం మూవీ టీమ్ అంతా మెడలో పూల మాలలు వేసుకున్నారని గుర్తుచేసుకున్నాడు. అదే క్రమంలో తన మెడలో, కీర్తి సురేశ్ మెడలో కూడా పూల మాలలు వేశారని అన్నాడు. ఆ సందర్భంలో తనది, కీర్తిది ఫోటో ఎడిట్ చేసి పెళ్లి అయిపోయిందంటూ ఎవరో వైరల్ చేశారని స్పష్టం చేశాడు.


కంగ్రాట్స్ అల్లుడు..


సినిమా పూజా కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా పాల్గొన్నా కూడా కేవలం తనది, కీర్తి సురేశ్‌ది ఫోటో మాత్రం పూల మాలలతో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పెళ్లి అని వార్తలు మొదలయ్యాయని సతీష్ క్లారిటీ ఇచ్చాడు. అలా వైరల్ అయిన ఫోటోలు చూసి కీర్తి సురేశ్ తల్లి సైతం ఫోన్ చేసి కంగ్రాట్స్ అల్లుడు చెప్పిందని షాకింగ్ విషయం తెలిపాడు. అదంతా మామూలుగా చేశారని, ఆ రూమర్స్‌ను కీర్తి కుటుంబం పెద్దగా పట్టించుకోలేదని తర్వాత అర్థమయ్యిందని చెప్పాడు. 2017లో ‘భైరవ’ సినిమా విడుదలయ్యింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు కీర్తి సురేశ్, సతీష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో చర్చ సాగింది. రెండేళ్ల తర్వాత అంటే 2019లో సింధు అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు సతీష్. దాంతో కీర్తితో ప్రేమ, పెళ్లి అనే రూమర్స్‌కు చెక్ పడింది.


అనిరుధ్‌తో ప్రేమ..


కీర్తి సురేశ్ రిలేషన్‌షిప్‌పై రూమర్స్ రావడం అదేమీ మొదటిసారి కాదు. సెన్సేషనల్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో కీర్తి ప్రేమలో ఉందని, త్వరలోనే వీరికి పెళ్లి కూడా కానుందని రూమర్స్ వచ్చాయి. దానిపై కీర్తి కుటుంబం స్పందించింది. అనిరుధ్.. తమకు చాలాకాలంగా తెలుసని.. కీర్తి, తను క్లోజ్ ఫ్రెండ్స్ అని పెళ్లి వార్తలను కొట్టిపారేసింది. అంతే కాకుండా ఒక బిజినెస్ మ్యాన్‌తో కీర్తి పెళ్లి ఫిక్స్ అయ్యిందని కూడా కోలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. అయితే ఇవేమీ నిజం కాదని, తను ఇష్టపడిన మనిషిని తానే స్వయంగా ఫ్యాన్స్ ముందుకు తీసుకొస్తానని కీర్తి స్పష్టం చేసింది.


Also Read: పద్మవిభూషణుడికి అమెరికాలో 'మెగా' సత్కారం!