హీరోయిన్ కియారా అడ్వాణీ (Kiara Advani)కి హిందీలో మరో భారీ సినిమా చేసే అవకాశం వచ్చింది. రణవీర్ సింగ్ (Ranveer Singh) సరసన నటించనున్నారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్న 'డాన్ 3'లో కియారా అడ్వాణీ హీరోయిన్ అని ఈ రోజు అనౌన్స్ చేశారు. 


రణవీర్... కియార... మొదటి సినిమా
'డాన్ 3' స్పెషాలిటీ ఏమిటంటే... రణవీర్ సింగ్, కియారా అడ్వాణీ కలయికలో ఇది మొదటి సినిమా. ఇప్పటి వరకు వీళ్లిద్దరూ కలిసి వెండితెరపై సందడి చేయలేదు. సో... సిల్వర్ స్క్రీన్ మీద వీళ్ల కాంబినేషన్ ఎలా ఉంటుందోనని ప్రేక్షకులతో పాటు హిందీ చిత్రసీమ వర్గాలు సైతం ఆసక్తి కనబరుస్తున్నాయి. 


డాన్ ఫ్రాంచైజీలో (డాన్ 3 సినిమాలో) తాను భాగం అయినందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉందని కియారా అడ్వాణీ ట్వీట్ చేశారు. ప్రేక్షకుల ప్రేమ, మద్దతు కావాలని ఆమె కోరారు.


Also Read19 కోట్లతో తీస్తే వచ్చింది 80 లక్షలే... సల్మాన్ డిజాస్టర్ దెబ్బకు దర్శకుడి కెరీర్ క్లోజ్, హీరోయిన్‌ అయితే ఇండియలో ఇంకో సినిమా చేయలేదు... ఆ ఫ్లాప్ ఏదో తెలుసా?






అప్పుడు ప్రియాంక... ఇప్పుడు కియార!
'డాన్' సినిమా అంటే హిందీ ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా జోడీ. వాళ్లిద్దరి జోడీ ఆ స్థాయిలో ప్రజల్ని అలరించింది. 'డాన్, 'డాన్ 2' సినిమాలను షారుఖ్ ఖాన్ హీరోగా తీసిన ఫర్హాన్ అక్తర్... డాన్ ఫ్రాంచైజీలో మూడో సినిమాకు వచ్చేసరికి హీరోని మార్చేశారు. షారుఖ్ బదులు రణవీర్ సింగ్ (Ranveer Singh)ను తీసుకున్నారు. హీరో మారడంతో హీరోయిన్ కూడా మారారు. ప్రియాంక చోప్రా బదులు కియారా అడ్వాణీ వచ్చారు.


Also Readపదేళ్ల తర్వాత హిందీ సినిమాలో రాశీ ఖన్నా - యాక్షన్ థ్రిల్లర్ లో శారీలో...



'డాన్ 3'లో హీరో రణవీర్ సింగ్ అని అనౌన్స్ చేసిన తర్వాత బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. షారుఖ్ అభిమానుల నుంచి అయితే చాలా వ్యతిరేకత వచ్చింది. డాన్ పాత్రలో మరొకరిని ఊహించుకోలేమని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేశారు. కియార విషయంలో అటువంటి వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశాలు తక్కువ.


డాన్ 3... థియేటర్లలోకి వచ్చే ఏడాది
గత ఏడాది ఆగస్టులో డాన్ 3 సినిమాను అనౌన్స్ చేశారు. బాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్ ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.


రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాలోనూ
ప్రస్తుతం కియారా అడ్వాణీ చేస్తున్న సినిమాలకు వస్తే... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ 'వార్ 2'లో కూడా ఆమె ఉన్నారు. అందులో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. మరి, ఇద్దరిలో ఎవరికి జోడీగా కియారా అడ్వాణీ కనిపిస్తారో చూడాలి.