దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో 'పెళ్లి సందD'  రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పాతికేళ్ల క్రితం ఇదే 'పెళ్లి సందడి' పేరుతో సినిమా తీసి రికార్డులు తిరగరాసిన ఆయన... ఇప్పుడు 'పెళ్లి సందD' సినిమాలో వశిష్ట అనే పాత్రలో నటించారు. ఈ సినిమాతో దర్శకేంద్రుడి శిష్యురాలు గౌరీ రోనంకి డైరెక్టర్ గా పరిచయం కానున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ తనకుడు రోషన్ హీరోగా నటిస్తుండగా.. శ్రీలీల హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. దసరా కానుకగా.. అక్టోబర్ 15న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఆదివారం నాడు నిర్వహించారు. 

 


 

ఈ ఈవెంట్ లో రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ''ఆర్కే ఫిలిం అసోసియేట్స్ అంటే.. రాఘవేంద్రరావు, కృష్ణమోహన్ రావు అని నా బ్రదర్ పేరుతో పెట్టాను. ఆర్కేలో చిరంజీవి, వెంకటేష్ సినిమాలు చేశారు. ఈ బ్యానర్ అంటే అన్నయ్యకు చాలా ఇష్టం. ఆర్కేలో 12 సినిమాలు చేశాం. 'బాహుబలి'కి కె.రాఘవేంద్రరావు ప్రెజంట్స్ అని పడింది.  కె.కృష్ణమోహన్ రావు ప్రజంట్స్ అని ఓ సినిమా చేయాలనుకున్నారు. రెండేళ్లక్రితం ఆయన ఆరోగ్యం పాడైంది. ఆయన ఉండగానే ఈ సినిమా చేయాలనుకున్నారు. కానీ కరోనా వలన కుదరలేదు. పెళ్లి సందడి పాట మాత్రం ల్యాప్ టాప్ లో చూపించాను. చిన్నపిల్లాడిలా చప్పట్లు కొట్టారు. అన్నయ్య మొదటిసారి నటిస్తున్నా.. నాన్నగారు హీరోగా వచ్చి డైరెక్టర్ అయ్యారు. నేను డైరెక్టర్ అయ్యాక.. నటుడిగా చేయాలనుకుంటున్నా అని చెప్పాను. నువ్ ప్రొడ్యూసర్ కాబట్టి నీ చేత్తో నాకు రెమ్యునరేషన్ చెక్ ఇవ్వమని అడిగితే.. తన సంతకం చేసి ఇచ్చాడు. ఇప్పటికీ ఆ చెక్ నాతోనే ఉంది. కొన్ని కారణాల వలన ఆరోగ్యం పాడై.. ఈ సినిమా చూడకుండానే ఆయన కాలం చేశారు. ఆయన ఎక్కడున్నా సరే ఈ సినిమా చూస్తారు. ఇక సినిమా గురించి చెప్పాలంటే.. నేనెప్పుడూ నటించాలనుకోలేదు. వెంకటేష్, దిల్ రాజు లాంటి వాళ్లు అడిగారు కానీ నేను చేయలేదు. ఈ సినిమాలో పెద్ద రోల్ ఏం కాదు.. నా పక్కన రాజేంద్రప్రసాద్ ఉండడంతో ఏదో మ్యానేజ్ చేశాను'' అంటూ చెప్పుకొచ్చారు. 


Also Read: 'మా' ఎన్నికల్లో ఓటేసిన పవన్ కల్యాణ్.. అది అవసరమా అనిపించింది అంటూ కామెంట్


Also Read ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!


Also Read:  ‘మా’లో రచ్చ.. శివబాలాజీ చేయి కొరికిన హేమా.. ప్రకాష్ రాజ్‌తో మంచు ఫైట్


Also Read: 'ఆర్ఆర్ఆర్'లో ఎవరూ చూడని స్టిల్స్..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి