Karthik Dandu: సినిమా ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్లకు సినిమా అవకాశాలు రావడానికి ఎన్నో లెక్కలు ఉంటాయి. ముందు ఒకటి రెండు సినిమాల్లో వరుసగా అవకాశాలు వచ్చినా తర్వాత కొత్త అవకాశాలు రావాలి అంటే గత సినిమాలు పాజిటివ్ టాక్ ను తెచ్చుకుని ఉండాలి. లేదంటే కొత్త ఛాన్స్ లు రావడం కాస్త కష్టమైన పనే. అయితే కొంత మంది హీరోయిన్లకు వరుసగా హిట్ వస్తే ఆమెది గోల్డెన్ లెగ్ అనే టాక్ వస్తుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటి పేరుతో దూసుకెళ్తుంది నటి సంయుక్త మీనన్. ఆమె టాలీవుడ్ లో నటించింది కొన్ని సినిమాలే అయినా అవన్నీ మంచి హిట్ ను అందుకోవడంతో ఆమెను అంతా గోల్డెన్ లెగ్ అని పిలుస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆమె రీసెంట్ గా నటించిన సినిమా ‘విరూపాక్ష’. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో సినిమా దర్శకుడు కార్తీక్ దండు ఆమెను గోల్డెన్ లెగ్ అని పిలవడం పట్ల స్పందిస్తూ హీరోయిన్ సంయుక్త మీనన్ పై నోరు జారారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


సంయుక్త వచ్చాకే సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయ్యింది: కార్తీక్ దండు


సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నటించిన సినిమా ‘విరూపాక్ష’. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మూవీ టీమ్ కు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. మూవీలో సంయుక్త మీనన్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటి వరకూ గ్లామర్ రోల్ లలో కనిపించిన సంయుక్త ఈ మూవీలో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఇటీవల మూవీ టీమ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా మిత్రలు సంయుక్త మీనన్ ను గోల్డెన్ లెగ్ హీరోయిన్ అని పిలవడం పట్ల దర్శకుడు కార్తీక్ దండు స్పందించారు. వాస్తవానికి సంయుక్త మీనన్ ‘బింబిసార’ సినిమా రిలీజ్ కు ముందే ‘విరూపాక్ష’ సినిమాకు సైన్ చేసిందని చెప్పుకొచ్చారు. అందరూ ఆమెను గోల్డెన్ లెగ్ అంటున్నారని కానీ ఆమె ఈ సినిమాకు వచ్చాకే సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయింది అంటూ ఫ్లో లో నోరు జారారు. అయితే తర్వాత హీరోయిన్ లకు సినిమా హిట్ ఫ్లాప్ లకు సంబంధం లేదు అంటూ దానిపై మళ్లీ వివరణ ఇచ్చారు. 


వరుస హిట్ లతో దూసుకెళ్తున్న సంయుక్త..


సంయుక్త మీనన్ కు మలయాళంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కూడా ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది సంయుక్త మీనన్. ఈ సినిమా తర్వాత ‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ ఇలా వరుస సినిమాల్లో నటించింది. ఇప్పటి వరకూ ఈ బ్యూటీ నటించిన ఈ నాలుగు సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి. దీంతో సంయుక్తకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులోనే పలు భారీ ప్రాజెక్టులు సంయుక్త చేతిలో ఉన్నాయి. రీసెంట్ గా సంయుక్త నటించిన ‘విరూపాక్ష’ మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ తో టాలీవుడ్ లో సంయుక్త క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.


Read Also: ఎట్టకేలకు ‘జవాన్’లో అల్లు అర్జున్? పుష్పరాజ్ ఫ్యాన్స్‌కు పూనకాలేనట!