దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో నాలుగేళ్ల బీఈడీ కోర్సు త్వరలోనే అందుబాటులోకి తేనున్నారు. ఇంజినీరింగ్‌తో పాటు అన్నిరకాల కోర్సులు ఐఐటీల్లో అందుబాటులోకి వస్తుండగా, తాజాగా బీఈడీ కోర్సు కూడా ఈ జాబితాలో చేరనుంది. ఇటీవల నిర్వహించిన ఐఐటీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ నాలుగేళ్ల బీఈడీ (ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం)ని ఐఐటీల్లో ప్రవేశపెట్టడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కోర్సును ప్రవేశపెట్టేందుకు నాలుగు ఐఐటీలు ముందుకు రాగా, ఖరగ్‌పూర్‌ ఐఐటీలో నాలుగు సంవత్సరాల బీఈడీ కోర్సును ప్రవేశపెట్టాలని గతంలోనే నిర్ణయించారు.


డ్యూయల్‌ డిగ్రీగా..
ఈ నాలుగేళ్ల బీఈడీ కోర్సును డ్యూయల్‌ డిగ్రీ కోర్సుగా పేర్కొనవచ్చు. తెలంగాణలో డిగ్రీ పూర్తి చేయడానికి మూడేళ్లు, బీఈడీ పూర్తిచేయడానికి రెండేళ్ల సమయం పడుతోంది. అయితే ఈ డ్యూయల్ డిగ్రీ విదానంతో.. నాలుగేళ్లలోనే మూడేళ్ల డిగ్రీతోపాటు రెండేళ్ల బీఈడీ కోర్సులను ఒకే దఫాలో పూర్తిచేసేందుకు అవకాశం కలుగుతుంది. బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీకాం బీఈడీల పేరుతో కోర్సులను నిర్వహించనున్నారు. ప్రస్తుత బీఈడీ కాలేజీల్లో బోధన అంతంత మాత్రంగానే ఉన్నదన్న విమర్శలున్నాయి. కొత్త టీచర్లను తయారుచేసేందుకు, శిక్షణనిచ్చేందుకు ఐఐటీలు ఉత్తమ కేంద్రాలుగా భావించిన కేంద్ర ప్రభుత్వం వీటిల్లో నాలుగేండ్ల బీఈడీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.


Also Read:


దేశవ్యాప్తంగా 57 కళాశాలల్లో నాలుగేళ్ల బీఈడీ కోర్సులు..
దేశవ్యాప్తంగా వచ్చే 2023-24 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేడెట్ బీఈడీ కోర్సుల నిర్వహణకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) ఆమోదం తెలిపింది. ప్రయోగాత్మకంగా 57 ప్రముఖ జాతీయ, రాష్ట్ర ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో దీన్ని ప్రారంభించింది. బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీకాం బీఈడీ కోర్సులను నిర్వహిస్తారు. ఇంటర్ తర్వాత ఉపాధ్యాయ విద్య చదవాలనుకున్న వారు ప్రవేశాలు పొందవచ్చు. ప్రస్తుతం మూడేళ్లు డిగ్రీ, రెండేళ్లు బీఈడీ చదివేందుకు ఐదేళ్లు పడుతోంది. సమీకృత బీఈడీ కోర్సుతో ఏడాది ఆదా అవుతుంది. జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సులో జాతీయ విద్యావిధానంలోని 5+3+3+4 స్థాయుల్లో బోధన ఉంటుంది. ఫౌండేషన్, సన్నద్ధత, మధ్య, సెకండరీ స్థాయిల్లోని విద్యార్థుల బోధనకు అనుగుణంగా అభ్యర్థులకు శిక్షణనిస్తారు. ఈ మేరకు ఎన్‌సీటీఈ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


దూరవిద్య బీఈడీ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ, బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సాధారణ డిగ్రీతోపాటు ఇంజినీరింగ్ డిగ్రీ చదివిన వారు కూడా దరఖాస్తుకు అర్హులు. అయితే ఇంజినీరింగ్‌లో సైన్స్/ మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 21 నుంచి మే 20 వరకు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే రూ.500 ఆలస్య రుసుముతో మే 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


డీఈఈసెట్-2023 నోటిఫికేషన్‌ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!
తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్‌-2023' (డీఎడ్‌) నోటిఫికేషన్‌ ఏప్రిల్ 21న విడుదలైంది. రెండేళ్ల కాలపరిమతితో ఉండే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించి ఏప్రిల్ 22 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. 
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..