నందు రాజ్యలక్ష్మి నిజస్వరూపం గురించి తులసికి చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. మీ మనసులో చాలా పెద్ద సంఘర్షణ జరుగుతుందని తులసి అంటుంది. యుద్ధమే జరుగుతుందని నందు బాధగా చెప్తాడు. ఆడ పిల్లని అత్తారింటికి పంపిన తర్వాత మీరు అప్పుడు పడ్డ బాధ విలువ అంటాడు. నందు మారినందుకు తులసి సంతోషిస్తుంది. విక్రమ్ కి నిద్రలో కూడా దివ్య కనిపిస్తూ ఉండేసరికి గిలాగిలా తన్నుకుంటాడు. నిద్రలేచి తన ఫోటో ఫోన్లో చూసుకుంటూ చేతికి చాక్లెట్ ఇచ్చి లాక్కున్నారు. నీకోసం తీసుకొచ్చిన మల్లెపూలు కావర్లోనే వాడిపోయి ఉంటాయని బుంగమూతి పెట్టుకుంటాడు. విక్రమ్ మాటలు విని తన తాతయ్య కావాలని రొమాంటిక్ సాంగ్ పెడతాడు. నిద్రలో పెట్టాడని అనుకుని ఆఫ్ చేస్తాడు. ముసలోడు మళ్ళీ ఆన్ చేస్తాడు. ఈ పాటలు వింటే నాకు నిద్రపట్టడం లేదని చిరాకు పడతాడు.


Also Read: బొమ్మ అదుర్స్- గుండు బాస్ తో గుటకలు వేయించిన వసు, రిషి కల నెరవేర్చిన జగతి


కాసేపు విక్రమ్ ని  తాతయ్య ఉసిగొల్పుతాడు. ఎవరికి కనిపించకుండా దివ్య గదికి వెళ్ళమని సలహా ఇస్తాడు. దివ్య నిద్రపోతుంటే విక్రమ్ వచ్చి కాసేపు సరసాలు ఆడతాడు. మొగుడు పెళ్లాలని వేరే వేరే గదిలో పడుకోమని ఎందుకు చెప్పారో అత్తయ్యని అడుగుతానని అంటుంది. మొగుడికి కావలసింది ఇస్తే వెళ్లిపోతానని ముద్దుగా అడిగేస్తాడు. ఇస్తాను కానీ ఇప్పుడు కాదు రేపు వెళ్లిపోమని గోముగా అడుగుతుంది. నిన్ను తలుచుకుంటూ నీ గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నా నిద్ర పట్టేసిందని అంటుంది. నేను అదే చేశాను కానీ పట్టడం లేదే అని బుంగమూతి పెట్టేస్తాడు. విక్రమ్ ని బలవంతంగా గదిలో నుంచి బయటకి పంపించేస్తుంది. తెల్లారి పూజకీ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. విక్రమ్, దివ్య ప్రేమగా మాట్లాడుకోవడం రాజ్యలక్ష్మి చూస్తుంది. మెడలో తాళి కట్టేసిన తర్వాత వాళ్ళని దూరంగా ఉంచలేమని బసవయ్య ఎక్కిస్తాడు.


Also Read: వసంత్ దగ్గర మాట తీసుకున్న మిస్టర్ యారగెంట్- వేద, యష్ ని కలనివ్వకుండా మాళవిక ప్లాన్


దివ్య వెనుక విక్రమ్ పరుగులు పెట్టడం చూసి రాజ్యలక్ష్మి కౌంటర్ వేస్తుంది. ఈ పూట వ్రతానికి సంబంధించిన పనులన్నీ కొత్త కోడలు చేతుల మీదుగా చేయించాలని పంతులు చెప్పినట్టు చెప్తుంది. మామిడి తోరణాలు కట్టడం ప్రసాదం చేయడం అంటూ పెద్ద లిస్ట్ చెప్తుంది. ఒక్కొక్క పని చెప్తూ ఉంటే చేసుకుంటూ పోతానని దివ్య అంటుంది. నాకు ఇక్కడ అన్నీ తెలుసని నా మీద పెట్టేశారు కానీ ఏం అర్థం కావడం లేదని దేవుడి ఫోటోస్ శుభ్రం చేసి బొట్టు పెడుతుంది. మండపంలో స్వామి వారి ఫోటో పెట్టబోతుంటే అలా పెట్టేస్తున్నావ్ ఏంటి మీ ఇంట్లో ఎప్పుడూ ఈ వ్రతం చేసుకోలేదా అని అడుగుతుంది. లేదని అంటే అందుకే వాళ్ళ కాపురం నిలబడ్లేదు నీకు అలాంటి పరిస్థితి రాకూడదంటే నిష్టగా పంతులు చెప్పిన పనులు చెయ్యమని వెటకారంగా చెప్తుంది. దివ్య చేసే ప్రతి పనికి వంకలు పెడుతూ తల్లి ఇదేనా నేర్పించిందని దెప్పి పొడుస్తూ తనని బాధపెడుతూ ఉంటారు.