ప్రపంచంలో చాప కింద నీరులా క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్యాన్సర్ సాధారణంగా ప్రారంభంలో ఎటువంటి సంకేతాలు లేదా లక్షణాలు చూపించదు. అందుకే దీన్ని ప్రారంభ దశలో గుర్తించడం కష్టమైపోతుంది. అయినప్పటికీ కొన్ని హెచ్చరిక సంకేతాల ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. చాలామంది వాటిని తేలికగా తీసుకుంటారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా వైద్యులను కలిసి టెస్టులు చేయించుకోవడం చాలా ముఖ్యం.
జ్వరం
అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకిన రోగులు ప్రారంభ దశలో తరచుగా జ్వరం బారిన పడతారు. దీనికి కారణం ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కణితులు పెరుగుతూ ఉండడమే. కాన్సర్ కారణంగా వచ్చే మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటివి జ్వరానికి దారితీస్తాయి.
చెమటతో తడిసి
ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకిన రోగికి ఉదయాన్నే చెమట పట్టేస్తుంది. ఇలా చెమట పట్టడానికి క్యాన్సర్ వల్ల వచ్చిన జ్వరం కారణం కావచ్చు. ఇది శరీరాన్ని చల్లబడడానికి చెమట పట్టేలా చేస్తుంది.
పొడి దగ్గు
దీన్ని అందరూ తేలిగ్గా తీసుకుంటారు. మూడు వారాల కంటే ఎక్కువ కాలం ఈ పొడి దగ్గు ఉంటే అది ఊపిరితిత్తుల క్యాన్సర్ ఏమో అని అనుమానించాలి. ఉదయాన్నే లేచిన వెంటనే పొడి దగ్గు వేధిస్తుంటే తేలిగ్గా తీసుకోకూడదు. ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న వారిలో కనీసం 65 శాతం మంది దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు.
కఫంలో రక్తం
దగ్గినప్పుడు గొంతు నుంచి కఫం వచ్చే అవకాశం ఉంది. ఆ కఫంలో రక్తం కనిపిస్తే అది ఊపిరితిత్తుల క్యాన్సర్ కు సంకేతం కావచ్చు. ఈ కఫం చాలా మందంగా ఉంటుంది.
పైన చెప్పిన సంకేతాలతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి
1. శ్వాస తీసుకున్నప్పుడు నొప్పిగా అనిపిస్తుంది
2. దగ్గుతున్నప్పుడు నొప్పి కలుగుతుంది.
3. శ్వాస ఆడడం కష్టంగా మారుతుంది
4. తీవ్రమైన అలసట వస్తుంది
5. ఆకలి తగ్గిపోతుంది
6. బరువు తగ్గిపోతూ ఉంటారు
7. చేతి వేళ్ళు వంగిపోవడం లేదా వాటి చివర్లు పెద్దవి కావడం వంటివి జరుగుతాయి.
8. ఆహారం మింగేటప్పుడు గొంతు నొప్పి వస్తుంది.
9. గురక అధికమవుతుంది.
10. స్వరం మారుతుంది
11. ముఖము లేదా మెడ దగ్గర వాపు వస్తుంది.
12. ఛాతీలో లేదా భుజంలో నొప్పి పెడుతుంది
ఈ లక్షణాలను క్యాన్సర్ కు సంబంధించినవి. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రారంభదశలోనే క్యాన్సర్లను గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుంది. ఎక్కువ కాలం జీవించే అవకాశం పెరుగుతుంది.
Also read: ఈ పోషకాలు లోపిస్తే పీరియడ్స్ సమయంలో తీవ్రంగా నొప్పులు వచ్చే అవకాశం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.