మెడికల్ కాలేజీకి పర్మిషన్ రావడం కష్టం కదా మహేంద్ర, జగతి అంటారు. పర్మిషన్ వస్తుందని రిషి ధీమాగా సమాధానం చెప్తాడు. వాడితో ఛాలెంజ్ ఎందుకు, రోజుకొక మాట మారుస్తున్నాడని వసు కూడా చెప్తుంది. మహేంద్ర ఎన్ని చెప్పినా కూడా సౌజన్యరావుతో చేసిన ఛాలెంజ్ గురించి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్తాడు. పది రోజుల్లో పర్మిషన్ తీసుకొచ్చి ఆ సౌజన్యరావుకి నేనెంతో చూపిస్తానని అంటాడు. వసు డల్ గా ఉండటం చూసి ఏంటి అలా ఉన్నావాని అడుగుతాడు. మీకున్న ధైర్యం నాకు లేదు అనుకున్నది జరగకపోతే అని వసు అంటుంటే బాధపడకు భయపడకు అయినా ఈ ఛాలెంజ్ లో మనం గెలుస్తామనే నమ్మకం ఉందని కాన్ఫిడెంట్ గా చెప్తాడు. ఛాలెంజ్ మొదలైంది త్వరగలో డీబీఎస్టీ కాలేజ్ ఎంఎస్ ఆర్ కాలేజీ లో కలవబోతుంది. పర్మిషన్ రాకుండా మీరే చూసుకోవాలని మెసేజ్ చేస్తాడు. అటు నుంచి ఒకే అని రిప్లై వస్తుంది.
Also Read: వసంత్ దగ్గర మాట తీసుకున్న మిస్టర్ యారగెంట్- వేద, యష్ ని కలనివ్వకుండా మాళవిక ప్లాన్
అందరూ మెడికల్ కాలేజ్ పనుల్లో నిమగ్నమైపోతారు. మనకి పర్మిషన్ రాలేదని వసు చెప్పడంతో రిషి సీరియస్ అవుతాడు. అన్ని అర్హతలు ఉన్నా కానీ ఎందుకు రాలేదని అడుగుతాడు. ఆ సౌజన్యరావు ఏదో ప్లాన్ చేసి పర్మిషన్ రాకుండా చేశాడని వసు అంటుంది. అప్పుడే సౌజన్యరావు పూల మాల తెచ్చి రిషి మెడలో వేసి కంగ్రాట్స్ చెప్తాడు. కోపంగా దాన్ని విసిరికొడతాడు. ఎందుకొచ్చారని రిషి కోపంగా అడుగుతాడు. మన డీల్ ప్రకారం డీబీఎస్టీ కాలేజ్ ని మా కాలేజ్ లో కలిపేయాలని అంటాడు.
ఎంఎస్ ఆర్: నాతో డీల్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని చేయాలి కదా.
మహేంద్ర: మీరు ఏదో కుట్రలు చేసి పర్మిషన్ తెచ్చుకున్నారు
ఎంఎస్ఆర్: అయినా ఈ డిస్కషన్ ఎందుకు. నువ్వు టైమ్ చెప్తే మన కాలేజీలు రెండు మెర్జ్ అయినట్టు అనౌన్స్ చేద్దాం
జగతి: తప్పకుండా అనౌన్స్ చేద్దాం. మీరు ఎంత కష్టపడి పర్మిషన్ తెచ్చుకున్నారో అదంతా కూడా అనౌన్స్ చేద్దాం
వసు: అంతక ముందు మనం వేరే పని చేద్దామనీ డీబీఎస్టీ కాలేజ్ అప్లికేషన్ ముందుకు వెళ్లకూడదంటూ సౌజన్యరావు మాట్లాడిన రికార్డ్ వసు వినిపిస్తుంది. ఆ వాయిస్ తనది కాదని అంటాడు. అది మీదని మేము అనలేదు కానీ మా దగ్గర ఒక వీడియో ఉంది దాంతో ఏమైనా చేయగలం ఏమో అని మళ్ళీ వీడియో చూపిస్తుంది. అది చూసేసరికి గుండు బాస్ గుటకలు వేస్తాడు. ఈ వీడియోలో ఉన్నది మీరు కాదని చెప్పొద్దు వాయిస్ మార్చవచ్చు కానీ మనిషిని మార్చలేం కదా
మహేంద్ర: బొమ్మ అదుర్స్ కదా
Also Read: అఖిల్ బాబుకి బారసాల, గొడవ చేసిన జెస్సి - రామని జానకి తీసుకొస్తుందా?
అప్పుడే సౌజన్యరావుకి కాల్ వస్తుంది. మీ పర్మిషన్ రద్దు చేశామని అవతలి వ్యక్తి చెప్పేసరికి షాక్ అవుతాడు. కాసేపు మహేంద్ర ఎంఎస్ఆర్ కి కౌంటర్ వేస్తాడు. రిషి టెన్షన్ పడుతూ ఉంటే వసు వాళ్ళు డోర్ బయట నిలబడి చూస్తూ ఉంటారు. వెళ్ళి తన అలక తీర్చమని జగతి వసుని పలకరించమని చెప్తుంది. కాసేపు బుజ్జగించి మినిస్టర్ రమ్మన్నాడని చెప్పి తీసుకుని వెళ్తుంది.