ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబంలో నుంచి ఒకరు హీరోగా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'రౌడీ బాయ్స్'. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. హర్ష దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 


చిన్న సినిమా అయినప్పటికీ 'రౌడీబాయ్స్' మంచి బజ్ ను క్రియేట్ చేయగలిగింది. దీంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆశిష్ కి మరో సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. సుకుమార్ రైటింగ్స్ లో ఆశిష్ తదుపరి సినిమా ఉంటుందని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. 


'రౌడీబాయ్స్' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న దిల్ రాజు.. సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇదే సమయంలో ఆశిష్ నెక్స్ట్ సినిమా సుకుమార్ రైటింగ్స్ ఉంటుందని చెప్పారు. సుకుమార్ దగ్గర పని చేసిన కాశీ అనే వ్యక్తి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాశీ చెప్పిన కథ నచ్చడంతో ఆశిష్ హీరోగా చేద్దామని ఫిక్స్ అయ్యామని.. దీనికి 'సెల్ఫిష్' అనే టైటిల్ పెడుతున్నట్లు చెప్పారు. సుకుమార్ తో కలిసి తను ఈ సినిమా నిర్మించబోతున్నట్లు చెప్పారు దిల్ రాజు. 


ఇప్పటికే సుకుమార్ తన దగ్గర అసిస్టెంట్స్ గా పనిచేసిన చాలా మందిని ఇండస్ట్రీకి దర్శకులుగా పరిచయం చేశారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో తన అసిస్టెంట్స్ తోనే సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు కాశీ అనే మరో అసిస్టెంట్ ను పరిచయం చేస్తున్నారు. ఇలా అసిస్టెంట్ ల కోసం సుకుమార్ తపన పడడం అభినందించాల్సిన విషయం. మరి కాశీ తన తొలి సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి.. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. 


Also Read: లిప్ లాక్ సీన్స్ పై ట్రోలింగ్.. స్పందించిన అనుపమ..


Also Read: మొన్న 'RRR'.. ఇప్పుడు 'BBB'.. క్రేజీ మల్టీస్టారర్ సెట్ అవుతుందా..?


Also Read: సమంతతో త్రివిక్రమ్ ప్లాన్.. నిజమేనా..?


Also Read: 'అవతార్ 2' రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్.. ఫ్యాన్స్ కు పండగే..


Also Read: మలైకాకి బ్రేకప్ చెప్పేశాడా..? ఇదిగో క్లారిటీ..


Also Read: మెగా హీరో కొత్త సినిమా టైటిల్ ఇదేనా..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి