తమిళ టాప్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ 'నానే వరువెన్'. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నారు. తెలుగులో 'నేనే వస్తున్నా' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించారు. ధనుష్‌కు జోడీగా ఎల్లిడ్ ఆవ్రమ్ హీరోయిన్ గా నటిస్తోంది. సెల్వ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల (సెప్టెంబర్) 29న ఈ సినిమా విడుదల కాబోతుంది.
ఈ సినిమాలో ధనుష్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఒకటి హీరో పాత్ర కాగా, మరొకటి విలన్ రోల్. ఈ రెండు పాత్రల్లోనూ ధనుష్ గతంలో ఎప్పుడూ కనిపించని మాదిరిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ధనుష్ విలన్ రోల్ పోషించడంతో కోలీవుడ్ లో ఈ సినిమా ఆసక్తిని కలిగిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా సన్నివేశాలతోనే సినిమాపై ఆసక్తి వచ్చేలా చేశారు మేకర్స్. డ్యూయల్ రోల్ లో ధనుష్ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంది. మరి పూర్తి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే!
'పొన్నియన్ సెల్వన్'తో ఢీ కొట్టనున్న ధనుష్: