టాలీవుడ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీప్రసాద్ ఒకరు. బాలీవుడ్ లో కూడా అతడికి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో సూపర్ హిట్ అయిన దేవిశ్రీప్రసాద్ సాంగ్స్ ను బాలీవుడ్ సినిమాల్లో వాడుకున్నారు. 'ఆర్య2' సినిమాలో రింగా, రింగా సాంగ్ అలానే 'డీజే' సినిమాలో 'సీటీమార్' సాంగ్స్ ను బాలీవుడ్ వాడుకుంది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాతో దేవిశ్రీప్రసాద్ క్రేజ్ పెరిగిపోయింది. బాలీవుడ్ లో ఈ సాంగ్స్ ఓ రేంజ్ లో పేలాయి. 


ముఖ్యంగా 'ఊ అంటావా మావ' ఐటెం సాంగ్ కి మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. ఈ ట్యూన్స్ నచ్చడంతో సల్మాన్ ఖాన్ తను నటిస్తోన్న 'కభీ ఈద్ కభీ దివాలి' సినిమాకి దేవిశ్రీప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. కానీ ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దేవిశ్రీ కొన్ని ట్యూన్స్ ని సల్మాన్ కి వినిపించగా.. కథకు తగ్గట్లుగా లేవని సల్మాన్ ఫీల్ అయ్యారట. 


దీంతో దేవిశ్రీప్రసాద్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కానీ కచ్చితంగా ఫ్యూచర్ లో కలిసి పని చేద్దామని సల్మాన్ మాటిచ్చారట. ఇప్పుడు దేవి ప్లేస్ లో 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ సినిమా ఆఫర్ కావడంతో రవి బస్రూర్ వెంటనే ఓకే చెప్పేశారట. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అలానే రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.  


Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?


Also Read : మేనకోడల్ని నిర్మాతగా పరిచయం చేస్తున్న అల్లు అరవింద్ - కొత్త సినిమా షురూ