ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సేవలు గురువారం మధ్యాహ్నం నుంచి పూర్తిగా స్తంభించినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్, మనీ ట్రాన్స్‌ఫర్, యూపీఐ, యోనో యాప్‌లు పని చేయడం లేదు. దీంతో వినియోగదారులు సోషల్ మీడియాలో దీనిపై ఫిర్యాదు చేస్తున్నారు.


కొన్ని ఏటీయంల్లో మనీ విత్‌డ్రా చేయడానికి కూడా అవ్వడం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలాఖరులో వేతనాలు ఖాతాల్లో పడే సమయంలో ఇలా జరగడంతో నిరాశ చెందుతున్నారు. యోనో యాప్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సాయంత్రం 6:30 గంటల వరకు మెయింటెయిన్స్ ఉందని చూపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచే ఎస్‌బీఐ సేవలు డౌన్ అయ్యాయని డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ సూచిస్తుంది.