జానకికి రాధ సేవలు చేస్తుంటే రామూర్తి చేతులెత్తి దండం పెడతాడు. నీ కోసం మేము ఏం చేశామో తెలియదు కానీ ఎంత కష్టపడుతున్నావమ్మా. ఆరోజు ఆ పసి ప్రాణాన్ని నిలబెట్టి తల్లిలా సేవ చేస్తున్నావ్. ఈరోజు జానకి ఈ పరిస్థితిలో ఉంటే తల్లిలా సేవ చేస్తున్నావ్ ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను నువ్వు నిజంగా దేవతవి అని రామూర్తి ఎమోషనల్ అవుతాడు. నేను చేసింది ఏముంది మా అమ్మకి ఇలా ఉంటే వదిలిపెడతానా, చంకలో బిడ్డని వేసుకుని ఉన్న నాకు మీరు నీడ ఇచ్చారు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి అని రాధ అంటుంది. మాకోసం ఇంత చేస్తున్నావ్ నీ కోసం మేము ఏమైనా చేస్తాము చెప్పమ్మా వద్దని మాత్రం అనకు అని రామూర్తి అంటాడు. నాకు ఇప్పుడు ఏమి వద్దు అవసరం అయినప్పుడు అడుగుతా అని అంటే మాట ఇస్తున్నా ఏమడిగినా చేస్తాను అని రామూర్తి అంటాడు.


ఆదిత్య దేవిని డాక్టర్ దగ్గరకి తీసుకుని వస్తాడు. అటు జానకి జరిగింది సైగల ద్వారా రాధకి చెప్పాలని ట్రై చేస్తుంది కానీ తను మాత్రం అర్థం చేసుకోలేదు. అది చూసిన చిన్మయి వెంటనే వెళ్ళి నోట్స్ తీసుకొచ్చి నువ్వు చెప్పాలనుకున్నది ఇందులో రాయమని చెప్తుంది. అది చూసి మాధవ్ టెన్షన్ పడి వచ్చి ఎందుకు అమ్మని అలా ఇబ్బంది పెడతారని అంటాడు. నానమ్మ ఏదో చెప్పాలని అనుకుంటుంది చెప్పలేకపోతుంది రాయనివ్వు నాన్న అని చిన్మయి అంటుంది. జానకి రాయలేక ఇబ్బంది పడుతుంది. అప్పుడే దేవి వచ్చి ఆఫీసర్ సార్ పెద్ద డాక్టర్ ని తీసుకొచ్చామని చెప్తుంది. మెట్ల మీద నుంచి జారిపడటం వల్ల ఆ షాక్లో ఇలా జరిగింది ట్రీట్మెంట్ చేస్తే ఒక వారంలో మామూలు అవుతుందని డాక్టర్ చెప్తుంది. అది విని మాధవ్ షాక్ అవుతాడు.


Also Read: 'ఐ లవ్యూ నాన్న' అని ఏడిపించేసిన ఆదిత్య- శ్రీవారికి వేద ప్రేమలేఖ


జానకి తిరిగి కొలుకుంటుందని చెప్పేసరికి అందరూ సంతోషిస్తారు. రుక్మిణి వెళ్ళి ఆదిత్య పక్కన నిలబడేసరికి అది చూసి జానకి చాలా సంతోషిస్తుంది. అది మాధవ్ గమనిస్తాడు. రాధ నాది కావాలన్న ఆశ నాకు తప్ప ఎవరికి లేదేంటి అని అనుకుంటాడు. సత్య ఆదిత్య ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉండగా దేవుడమ్మ వస్తుంది. జానకమ్మకి బాగోలేదని రాధ ఆదిత్యకి చెప్పమనడం డాక్టర్ ని తీసుకుని రమ్మని చెప్పడం ఏంటి? అక్కడ మాధవ్, రామూర్తి ఇద్దరు ఉన్నారు. వాళ్ళని వదిలేసి ఆదిత్యని అడగటం ఏంటి. ఆదిత్య కూడా ముందు వెనుక ఆలోచించకుండా పరుగులు తియ్యడం ఏంటి అని సత్య కోపంగా అడుగుతుంది.


అదేంటి సత్య అలా అంటావ్ నా ఆరోగ్యం బాగోలేదంటే రామూర్తి, జానకి వచ్చారు కదా వాడు వెళ్తే తప్పేముందని దేవుడమ్మ అంటుంది. ప్రతి దానికి ఇంత లోతుగా ఎందుకు ఆలోచిస్తున్నావ్ కాస్త ఆలోచన తగ్గించు అని సున్నితంగా చెప్తుంది. మాధవ్ తన దగ్గరకి వచ్చేసరికి జానకి కంగారు పడుతుంది. ‘ఆ ఆదిత్య ఎవరో పెద్ద డాక్టర్ ని తీసుకొస్తాడా నీకు నయం అయితే నా పరిస్థితి ఏంటి మాట రాగానే నా గురించి అందరిలో చెప్పేసి నన్ను చెడ్డ వాడిని చెయ్యాలని చూస్తున్నావ్ కదా. నన్ను మెట్ల మీద నుంచి కింద పడేసింది వీడే అని చెప్పాలని చూస్తున్నావా. రాధని, దేవిని ఈ ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నావా. బిడ్డ తప్పు చేస్తే క్షమించాల్సింది నువ్వే. అలాంటిది నువ్వు నన్ను శిక్షించాలి అనుకుంటే ఎలా. గుర్తుందా ఆ రోజు మెట్ల దగ్గర ఏం జరిగిందే అదే అవకాశం ఇప్పుడు కూడా ఉంది. కానీ మళ్ళీ మళ్ళీ అలాంటి పనులు చెయ్యను. మరి అంత దుర్మార్గుడుని కాదు’ అని మాధవ్ అంటాడు.


Also Read: తులసి తప్పు చేసిందన్న సామ్రాట్- అమ్మలక్కల మాటలు విని రగిలిపోయిన అనసూయ