పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan)... మణిరత్నం దర్శకత్వం వహించిన తాజా సినిమా. అంతేనా? 'చియాన్' విక్రమ్, 'జయం' రవి, కార్తీ కథానాయకులుగా తెరకెక్కిన చారిత్రక సినిమా! అంతేనా? అందాల రాశి ఐశ్వర్యా రాయ్ బచ్చన్, సొగసరి త్రిష, తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ కథానాయికలుగా నటించిన సినిమా! ప్రకాష్ రాజ్, పార్తీబన్, జయరామ్, వెంకట్ ప్రభు తదితరులు నటించిన సినిమా. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన సినిమా. చోళ సామ్రాజ్య వైభవం గురించి కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా రూపొందిన సినిమా.


'పోన్నియిన్ సెల్వన్'కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకని, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి 'పోన్నియిన్ సెల్వన్' షోలు పడ్డాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉందనేది కొంత మంది ట్వీట్లు చేశారు. ఆడియన్స్ ట్విట్టర్ రివ్యూ (Ponniyin Selvan Twitter Review) ఎలా ఉందంటే?


చిరంజీవి వాయిస్ ఓవర్‌తో తెలుగు వెర్షన్!
'పొన్నియిన్ సెల్వన్' తెలుగు వెర్షన్‌కు చిరంజీవి (Chiranjeevi) వాయిస్ ఓవర్ ఇచ్చారని అమెరికాలో సినిమా చూస్తున్న ప్రేక్షకులు చెబుతున్నారు. ఆ మధ్య హైదరాబాద్‌లో జరిగిన 'PS1' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరుకు చిత్ర దర్శకుడు మణిరత్నం ఎందుకు థ్యాంక్స్ చెప్పారనేది ఇప్పుడు అర్థం అయ్యిందని ఆడియన్స్ పేర్కొంటున్నారు.



Also Read : తెలుగులో 'పొన్నియన్ సెల్వన్ 1' ఎన్ని కోట్లకు అమ్మారు? ఎన్ని కోట్లు రావాలి?







'పొన్నియిన్ సెల్వన్' సినిమాతో 70 ఏళ్ళ తమిళ సినిమా కల నిజమైందని కోలీవుడ్ ప్రేక్షకులు కొందరు ట్వీట్లు చేస్తున్నారు. 'చోళ దేశంలోకి స్వాగతం' అంటూ సిల్వర్ స్క్రీన్ మీద మణిరత్నం మేజిక్ చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. 'పొన్నియిన్ సెల్వన్'ను కోలీవుడ్ (తమిళ చలన చిత్ర పరిశ్రమలో) 'బాహుబలి', 'కెజిఎఫ్'గా ఒకరు పేర్కొన్నారు.


Also Read : 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?


'పొన్నియిన్ సెల్వన్' ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉందని అమెరికాలో సినిమా చూస్తున్న ఆడియన్స్ అంటున్నారు. ఎమోషనల్ హై లేనప్పటికీ... విజువల్స్, సాంగ్స్ పిక్చరైజేషన్, మ్యూజిక్ బావున్నాయట. కార్తీ అద్భుతంగా నటించాడని చెబుతున్నారు. కొంత మంది రన్ టైమ్ ఎక్కువ అయ్యిందని కూడా కామెంట్ చేస్తున్నారు. మరి, సెకండాఫ్ గురించి ఏం అంటారో చూడాలి.


















































మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు 'పొన్నియిన్ సెల్వన్' సినిమా (PS1 Review) ను భారీ నిర్మాణ వ్యయంతో సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల అయ్యింది. ఆల్రెడీ రెహమాన్ సంగీతం అందించిన 'పొంగే నది...' పాటకు మంచి స్పందన లభించింది. మిగతా పాటలు సైతం ఆయన అభిమానులను ఆకట్టుకున్నాయి. రెహమాన్ నేపథ్య సంగీతానికి సైతం ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది.తెలుగులో 'పొన్నియన్ సెల్వన్'ను ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.


తెలుగులో 'పొన్నియన్ సెల్వన్'ను రూ. 10 కోట్లకు అమ్మారని, రూ. 10.50 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెంట్ అవుతుందట. నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులు రూ. 3.5 కోట్లకు విక్రయించారట. సీడెడ్ ఏరియా బిజినెస్ రూ. 2 కోట్ల రేషియోలో జరిగిందని టాక్. ఆంధ్రాలో 'పొన్నియన్ సెల్వన్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 4.5 కోట్లు జరిగిందట.