యష్ తన గురించి మాళవికతో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ చాలా సంతోషిస్తుంది. భార్య స్థానానికి ఇంత గౌరవం, సంతోషం ఉంటుందా. ఇప్పుడు నాకు కలిగే ఈ ఫీలింగ్ ఆయన రాగానే షేర్ చేసుకోవాలి. కానీ ఆయన్ని చూడగానే ఏదో సంకోచం చెప్పాలనుకుంటా కానీ చెప్పలేను. ఈరోజు ఎలాగైనా ఆయనకి చాలా థాంక్స్ చెప్పి తీరాల్సిందే అని అద్దం ముందు నిలబడి ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేస్తుంది. అవేవీ సెట్ అవకపోవడంతో తను చెప్పాలనుకున్న ఫీలింగ్స్ అన్నీ లెటర్ రాసి పెట్టాలని అనుకుంటుంది.
Also Read: తులసి తప్పు చేసిందన్న సామ్రాట్- అమ్మలక్కల మాటలు విని రగిలిపోయిన అనసూయ
అటు హాస్పిటల్లో ఆదిత్య తన తల్లి కోసం బాగా ఏడుస్తూ ఉంటాడు. అది చూసి యష్ చాలా బాధపడతాడు. ఆది ఎడవకు నాన్న అని యష్ అంటే నాకు ఉన్నది మా మామ్ ఒక్కతే తనని కూడా నాతో ఉండనివ్వరా మీ వల్లే మామ్ కి ఇలా జరిగిందని ఆదిత్య అంటాడు. ఇటేమో వేద శ్రీవారికి తొలిసారి ప్రేమ లేఖ రాస్తూ ఉంటుంది. తనకి ఏమైనా అయితే నేను ఏమైపోతానో ఆలోచించారా? అని ఆది అనేసరికి నేను ఉన్నాను అని యష్ అంటాడు. 'ప్లీజ్ అలా అనకండి నేను ఏం చేస్తానో ఎక్కడ ఉంటానో తెలుసా? చిన్నప్పుడు నుంచి నేను ఎక్కువగా మిస్ అయ్యింది ఎవరో తెలుసా మిమ్మల్నే.. అలాగే నేను చూడకూడదు అనుకున్నది కూడా మిమ్మల్నే.. మా ఫ్రెండ్స్ పేరెంట్స్ అందరూ వచ్చేవారు కానీ నా కోసం మా మామ్ ఒక్కతే వచ్చేది నువ్వు రావు.. నాన్న.. అని ఎంత కలవరించానో, నీకోసం ఎంత ఎదురుచూశానో తెలుసా? ఐ లవ్యూ డాడీ అని నా నోట్ బుక్ లో రాసుకునేవాడిని మీరంటే నాకు అంత ప్రేమ. నేను ఏం తప్పు చేశాను నన్ను వదిలేశారు. ఒకప్పుడు నాకు మీరంటే ఎంతో ప్రేమ కానీ ఇప్పుడు కాదు. నాకొక హెల్ప్ చేస్తారా మా మామ్ ని వదిలెయ్యండి' అని ఆది చాలా ఎమోషనల్ గా మాట్లాడతాడు.
Also Read: వెళ్లిపొమ్మన్న రిషి , ఇద్దరం ఒక్కటే అన్న వసు - రిషిధార ప్రేమయుద్ధం
అక్కడ ఉన్న పోలీస్ ని పిలిచి మా అమ్మ సూసైడ్ చేసుకోవడానికి ఈయనే కారణం మా అమ్మకి నరకం చూపించాడు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోండి అని ఆది యష్ ని చూపించి చెప్తాడు. పోలీస్ వచ్చి యశోధర్ గారు మీరు స్టేషన్ కి రండి అనేసరికి వసంత్ అడ్డుపడతాడు. చిన్న పిల్లాడు తల్లికి అలా అయ్యిందనే సరికి అలా మాట్లాడుతున్నాడు. నిజం తెలియాలంటే మాళవిక చెప్పాలి ఆమె చెప్పిన తర్వాత మీరు ఏ యాక్షన్ తీసుకున్నా ఒకే అని చెప్తాడు. వేద చాలా సంతోషంగా భర్త మీద తనకున్న ఫీలింగ్స్ అన్నీ లేటర్లో రాసి చూసుకుని మురిసిపోతుంది. హాస్పిటల్ కి అభిమన్యు, ఖైలాష్ వస్తారు. అభిని చూసి ఆది వెంటనే వెళ్ళి కౌగలించుకుని ఏడుస్తాడు. అది చూసి యష్ గుండె ముక్కలవుతుంది. ఖైలాష్ వచ్చి హాయ్ బామర్ది అనేసరికి యష్ కోపంగా తనని కొట్టడానికి వెళ్తుంటే వసంత్ ఆపుతాడు. అప్పుడే యష్ కి వేద ఫోన్ చేస్తుంది కానీ కట్ చేస్తాడు.