మాధవ్ మల్లికార్జున్ కి ఫోన్ ట్రై చేస్తాడు.. కానీ వాడు లిఫ్ట్ చెయ్యడు. ఏం జరిగిందో అర్థం కావడం లేదు అసలు ఏం జరిగిందని మాధవ్ ఆలోచిస్తాడు. మల్లికార్జున్ ఒక చోట తాగుతూ కూర్చుని కలెక్టర్ కి నిజం చెప్తే మాధవ్ సార్ వెతికి వెతికి చంపేస్తాడు, అటు కలెక్టర్ కో దొరికితే కొట్టి నిజం కక్కిస్తాడు అని టెన్షన్ పడతాడు. ఫోన్ చేసి జరిగింది చెప్పడానికి ఫోన్ కూడా ఎక్కడో పడిపోయిందని అనుకుంటాడు. చిన్మయి రాధ దగ్గరకి వస్తుంది. ఎందుకు చెల్లెలు ప్రతి సారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, నాతో కూడా సరిగా మాట్లాడటం లేదని రాధని అడుగుతుంది. ఏం కాలేదులే నువ్వు ఆలోచించకు, బాధపడకు అని రాధ చెప్తుంది. మీ నాయనే నా బిడ్డని బాధపెడుతున్నాడని ఎట్లా చెప్పేది అని రాధ మనసులో అనుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది.
ఎందుకు నాయన నాకు అబద్ధం చెప్పినావ్ అని దేవి మాధవ్ ని నిలదిస్తుంది. ఆ మాటకి మాధవ్ బిత్తరపోతాడు. 'ఎవరినో చూపించి మా నాయన అని చెప్పినావ్? నువ్వు చెప్పావ్ కదా అని ఆయనే మా నాన్న అనుకున్నా.. నాయన నాయన అని పిలిచినా, ఆయన కోసం ఎంతో ఏడ్చినా తీరా చూస్తే ఆయన మా నాయన కాదు మా నాయన లెక్క నాటకం ఆడినాడు. చెప్పు నాయన నువ్వెందుకు అబద్ధం చెప్పావ్' అని అడుగుతుంది. నేను అబద్ధం ఎందుకు చెప్తాను వాడి చేతిలో నీది, మీ అమ్మ ఫోటో చూసి వాడి మాట్లాడిన మాటలు విని మోసపోయాను అని కవర్ చేస్తాడు. పెద్దోడివి నువ్వు కూడా అలా నమ్మితే ఎట్లా?నువ్వు నమ్మినవ్ అని నేను నమ్మాను, నాయన ఎవరని అమ్మని అడిగితే అమ్మ ఏమి మాట్లాటడం లేదు అని దేవి అంటుంది. వాడు నాటకం ఆడుతున్నాడని తెలిస్తే నేనే వాడిని కొట్టి చంపేసే వాడిని అని మాధవ్ అంటాడు. మీ నాన్న ఎవరో నేను కనిపెడతా అని చెప్తుంటే రాధ వచ్చి ఆ మాటలు వింటుంది.
Also Read: యష్, వేదని విడదీసేందుకు అభిమన్యు కుట్ర - ఆదిత్యని ఖుషి స్కూల్ లో చేరాడని తెలిసి భయపడుతున్న మాలిని
నువ్వు ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని రాధ అంటుంది. ఎప్పుడు నుంచి నాయన గురించి అడుగుతున్నా, నాయన కోసం నేను ఎంతగా ఏడుస్తున్నా, ఎన్ని సార్లు అడుగుతున్న నువ్వు నాయన గురించి చెప్పవ్ అని దేవి అంటుంది. లేదు నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా మీ నాయన ఎవరో చెప్తాను అని రాధ మాటిస్తుంది. ఆ మాటకి మాధవ్ షాక్ అవుతాడు. నువ్వు ఇలాగే అంటావ్ కానీ చెప్పవు నాకు ఎవరు చెప్పొద్దు నేనే మా నాయన ఎవరో తెలుసుకుంటాను అనేసి దేవి కోపంగా వెళ్ళిపోతుంది. ఒట్టేసి చెప్పిందంటే నిజంగా చెప్పేస్తుందా అని మాధవ్ టెన్షన్ పడతాడు.
దేవుడమ్మ ఆదిత్యకి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. పక్కనే సత్య కూడా ఉంటుంది. ఇల్లు కూడా పట్టనంత పనిలో ఉన్నావా అని దేవుడమ్మ అడుగుతుంది. బయట పనులే కాదు ఇంట్లో పని గురించి కూడా ఆలోచించొచ్చు కదా అని అంటుంది. నువ్వు సత్యని తీసుకుని అమెరికా వెళ్ళాలి అని అంటుంది. ఆఫీసులో పని అవగానే చూస్తాను, నా పరిస్థితి కూడా అర్థం చేసుకో అని అంటాడు. అంటే అమ్మ మాట కూడా వినవా అనేసరికి ఆదిత్య కొప్పడతాడు. భర్తగా సత్య బాధ తీర్చాల్సిన బాధ్యత నీకు లేదా అని నిలదిస్తుంది. సత్యని తీసుకుని అమెరికా వెళ్లకపోతే నా నిర్ణయం ఇంకోలా ఉంటుంది ఆలోచించుకో అనేసి దేవుడమ్మ కోపంగా చెప్తుంది.
Also Read: అబార్షన్ చేయించుకోమన్న అఖిల్, ప్రెగ్నెన్సీ సంగతి తెలుసుకున్న జానకి - విషయం పసిగట్టిన మల్లిక
దేవి చేతికి ఆదిత్య పెట్టిన జీపీయస్ వాచ్ తీసుకొచ్చి మాధవ్ రాధకి ఇస్తాడు. పర్వాలేదు ఇద్దరు కలిసి రహస్యాన్ని బాగానే ఛేదించారని మాధవ్ అంటాడు. అలాగని వదిలిపెట్టేస్తాను అనుకున్నావా ఒక అవకాశం మిస్ అయితే ఇంకో అవకాశం వెతుకుతా అంటాడు. నువ్వు ఎన్ని అవకాశాలు కల్పించుకోవాలని చూసినా చివరికి నేను అనుకున్నదే జరుగుతుంది సారు అని రాధ నమ్మకంగా చెప్తుంది. నీ బిడ్డ గురించి ఆలోచించడం మానేసి నీ అంతు చూడటానికి నిమిషం కూడా పట్టదని రాధ కోపంగా అంటుంది. ‘దేవి నేను చెప్పినట్టు వినేలా చేసుకుంటాను. దేవికి ఆదిత్యే మీ నాన్న అని చెప్పడానికి మంచి ముహూర్తం పెట్టుకుని ఉంటావ్ కదా కానీ నేను ఉండగా అది జరగదు జరగనివ్వను’ అని మాధవ్ చెప్తాడు.