లయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ను తెలుగులో ‘భీమ్లా నాయక్’గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్, రాణా కీలక పాత్రలు పోషించారు. అయితే, ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ Sithara Entertainment ప్లాన్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. కానీ, హిందీ వెర్షన్ తెలుగుతోపాటు విడుదల కాలేదు. ఈ చిత్రం హిందీ రిమేక్, డబ్బింగ్ హక్కులు పొందిన The plaintiff JA Entertainment Pvt Ltd(వాది) కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడంతో ‘భీమ్లా నాయక్’ హిందీ డబ్బింగ్ వెర్షన్ విడుదలను తాత్కాలికం నిలిపేశారు. 


ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. ‘భిమ్లా నాయక్’ హిందీ వెర్షన్ రిలీజ్‌ను నిలిపేయాలనే నిర్ణయాన్ని కోర్టు తోసిపుచ్చింది. తెలుగులో చిత్రీకరించిన ‘భీమ్లా నాయక్’ సినిమాను హిందీలో డబ్ చేయడం తగదని, ఇది కాపీరైట్స్ ఉల్లంఘన కిందకు వస్తుందని జేఏ ఎంటర్‌టైన్మెంట్ తరపు న్యాయవాదులు వెల్లడించారు. మలయాళం ఒరిజినల్ వెర్షన్‌ను హిందీలో రీమేక్-డబ్బింగ్ చేసే అర్హత తమకే ఉన్నందున తెలుగు ‘భీమ్లా నాయక్’ను హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేయకుండా నిలిపేయాలని కోరారు.


దీనిపై కోర్టు స్పందిస్తూ.. ‘‘కాపీరైట్స్‌ను కొనుగోలు చేసిన యజమానికి హిందీతో సహా ఏ భాషలోనైనా తెలుగు సినిమాని డబ్ చేసే హక్కు ఉంది. ప్రతివాది(Sithara Entertainment) నిర్ణయాన్ని అడ్డుకొనేందుకు వాది ఏ హక్కును పొందలేరు’’ అని తెలిపింది. 2020, జులై నెలలోనే JA ఎంటర్‌టైన్మెంట్ మలయాలం ఒరిజినల్ వెర్షన్ హక్కులను సొంతం చేసుకుంది. దాని ప్రకారం వారు హిందీలో వారు డబ్బింగ్ లేదా రీమేక్ చేసుకోవచ్చు. కథలో మార్పులు చేసుకుని విడుదల చేసుకోవచ్చు.


అయితే, ఆ సంస్థ హిందీలో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుని షూటింగ్ మొదలుపెట్టే లోపే ‘భిమ్లా నాయక్’ తెలుగులో విడుదలైంది. హిందీ ట్రైలర్ కూడా విడుదల చేయడంతో జేఏ ఎంటర్‌టైన్మెంట్ కోర్టును ఆశ్రయించింది. అయితే, ఆ సినిమాను తెలుగులో మార్పుచేర్పులతో విడుదల చేసుకోడానికి సితారా ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ పూర్తి హక్కులను సొంతం చేసుకోవడం వల్ల హిందీలో కూడా డబ్బింగ్ చేసుకుని విడుదల చేసుకునే రైట్‌ను సొంతం చేసుకుందని కోర్టు పేర్కొంది. దీంతో ‘భిమ్లా నాయక్’ హిందీ వెర్షన్‌కు లైన్ క్లియర్ అయినట్లే.