విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన షార్ట్ ఫిలిం 'మనసానమః'. ఇప్పటికే ఈ సినిమా బోలెడన్ని రికార్డులు సంపాదించింది. ఇప్పటికీ రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు సహా ఆస్కార్ క్వాలిఫైకు వెళ్లిన ఈ షార్ట్ ఫిల్మ్.. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివెల్ లో బెస్ట్ షార్ట్ ఫిలింగా ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ లఘు చిత్రానికి 513 అవార్డులు దక్కాయి.
తాజాగా ఈ షార్ట్ ఫిల్మ్ నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ గా అత్యధిక పురస్కారాలు అందుకున్న చిత్రంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. గిన్నీస్ రికార్డ్స్ లో ఎక్కిన తొలి తెలుగు లఘు చిత్రంగా చరిత్ర సృష్టించింది 'మనసానమః'. ఈ షార్ట్ ఫిల్మ్ లో ధృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ హీరోయిన్లుగా నటించారు. గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్ రెడ్డి తన తొలి ప్రయత్నంగా ఈ షార్ట్ ఫిల్మ్ గా తెరకెక్కించారు.
ఈ షార్ట్ ఫిలిం స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది. అమ్మాయిలను అర్ధం చేసుకోవడం ఎంత కష్టమో ఈ ఫిల్మ్ లో చెప్పారు దర్శకుడు. దీనికోసం దర్శకుడు తీసుకున్న క్యారెక్టర్లు, వాటిని డిజైన్ చేసిన తీరు, స్క్రీన్ ప్లే అన్నీ ఆకట్టుకుంటాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటాయి.
Also Read: థియేటర్లలో 'పక్కా కమర్షియల్' తెలుగు సినిమాలు - ఓటీటీలో రెజీనా వెబ్ సిరీస్, బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్