బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో కంట్రోల్ (ఎన్‌సీబీ) దాడులు చేసింది. బాంద్రాలోని అనన్యా ఇంట్లో తనిఖీలు చేశారు అధికారులు. డ్రగ్స్ కేసులో అనన్యా పాండేని ఈరోజు ప్రశ్నించేందుకు నోటీసులు కూడా పంపినట్లు సమాచారం.
బాలీవుడ్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తె అనన్యా పాండే తన ఇంట్లో నుంచి ఓ బ్యాగులు పట్టుకొని బయటకు వెళ్లడాన్ని ఎన్‌సీబీ అధికారులు గమనించినట్లు సమాచారం. అయితే అనన్యా ఇంట్లో తనిఖీలు చేసిన అధికారులకు ఏం లభ్యమైందనే విషయం ఇంకా బయటకు రాలేదు.
షారుక్ ఇంట్లో కూడా..
అనన్యా ఇంటితో పాటు మన్నత్‌లోని షారుక్ ఖాన్ ఇంట్లో కూడా ఎన్‌సీబీ అధికారులు తనిఖీలు చేశారు.
షారుక్ ఖాన్ ఈరోజు ఉదయం ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లి కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను కలిశాడు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ అరెస్ట్ అయిన తర్వాత తన కుమారుడ్ని షారుక్ కలవడం ఇదే తొలిసారి. ఇటీవల ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ఎన్‌డీపీఎస్ కోర్టు రెండు సార్లు కొట్టివేసింది.
Also Read: 100 Crore Vaccinations: 'ఇక తగ్గేదేలే.. నవ చరిత్రను లిఖించాం.. 100 కోట్ల మార్క్‌పై మోదీ ప్రశంసలు'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి