Baby Movie Copy Rights Issue: 'బేబీ'.. యూత్ కి కనెక్ట్ అయిన సినిమా. 2023 రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. అయితే, ఈ చిత్రబృందం ఇప్పుడు చిక్కుల్లో పడింది. బేబి సినిమా కథ తనదంటూ షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు దర్శక, నిర్మాతలపై కేసు పెట్టారు.
కేసు ఏంటంటే?
శిరిన్ శ్రీరామ్ అనే వ్యక్తి షార్ట ఫిలిమ్స్ ని డైరెక్ట చేస్తుంటారు. అయితే, 2013లో అతను 'బేబీ' సినిమా డైరెక్టర్ రాజేశ్ ని కలిసి కథ చెప్పాడని ఆరోపిస్తున్నాడు. తన కథను 'బేబీ' సినిమాగా తీశాడని, కాపిరైట్స్ చట్టాన్ని ఉల్లంఘించాడని కేసు పెట్టాడు శిరిన్. 2013లో తన సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేయమని రాజేశ్ తనని కోరాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2015లో తాను కన్నా ప్లీజ్ పేరుతో కథ రాసుకుని, ప్రేమించొద్దు అనే టైటిల్ పెట్టుకున్నానని, దాన్ని సాయి రాజేశ్ సూచనతోనే శ్రీనివాసకుమార నాయుడు ఉరఫ్ ఎస్కేఎన్ కి చెప్పానని ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఇక అదే సినిమాని 2023లో రాజేశ్ దర్శకత్వం వహించగా.. ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని కలిసి నిర్మించారని, ఆ సినిమా మొత్తం ప్రేమించొద్దు సినిమానే అని కంప్లైంట్ ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు. ఇక సాయి రాజేశ్ జాతీయ పురస్కారం అందుకున్న 'కలర్ ఫోటో'కు రచయిత. కాగా.. జాతీయ అవార్డు అందుకున్నసినిమాకు రచయితగా పనిచేసిన అతనిపై ఇప్పుడు కేసు నమోదు అయ్యింది.
ఆనంద్ దేవర కొండ వైష్ణవి చైతన్య, విరాజ్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బేబీ' సినిమా 2023లో రిలీజైంది. ఈ కాలంలో లవ్ స్టోరీలు ఎలా ఉన్నాయి? స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? 'మొదటి ప్రేమకు మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వితంగా సమాధి చేయబడి ఉంటుంది అనే కాన్పెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ న్యూ ఏజ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి యూత్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. ఇక ఈ సినిమాలో చైతన్య యాక్టింగ్ కి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఆమెకు అనేక ఛాన్సులు వచ్చాయి కూడా.
కాగా.. మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమాపై కూడా కాపిరైట్స్ కేసు నమోదైంది. గతంలో స్వాతి పత్రికలో ప్రచురించిన కథను కొరటాల కాపీ చేసి శ్రీమంతుడు మూవీ తెరకెక్కించారంటూ రచయిత శరత్ చంద్ర హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ సందర్భంగా కథను కాపీ కొట్టారనేందుకు ఉన్న ఆధారాలను హైకోర్టుకు రచయిత శరత్ చంద్ర అందజేశారు. దీంతో ఆయనపై చర్యలను సమర్థించింది హైకోర్టు.
Also Read: 'వెన్నెల' కిషోర్ హీరోగా చారి 111 - ట్రైలర్ ఎప్పుడంటే?