Vennela Kishore 'Chaari 111': 'వెన్నెల' కిశోర్.. కామెడీకి కేరాఫ్ అడ్రస్. ఆయన సినిమాలో ఉన్నాడంటే కామెడీ కచ్చితంగా హిట్టే. కేవలం కామెడీ మాత్రంమే కాదు డిఫరెంట్ క్యారెక్టర్లు కూడా ప్లే చేశారు ఆయన. ఇక ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు వెన్నెల కిశోర్. 'చారి 111' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే కాన్సెప్ట్ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఇప్పుడు మరో అప్ డేట్ ఇచ్చారు.
ట్రైలర్ అప్పుడే..
కమెడియన్ గా అందరికీ సుపరిచితమైన వెన్నెల కిశోర్ హీరోగా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దాంతో పాటుగా ఈ మధ్యే రిలీజ్ చేసిన కాన్పెప్ట్ టీజర్ కి కూడా విశేష స్పందన వచ్చింది. దీంతో ఇప్పుడు సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకి సంబంధించి టీజర్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 12న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పటికే మార్చి 1న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 'చారి 111' ఫస్ట్ లుక్ చూస్తే... 'వెన్నెల' కిశోర్ స్టైలిష్ స్పై రోల్ చేస్తున్నారని ఈజీగా అర్థం అవుతోంది. సూటు, బూటు వేసి- గన్ పట్టుకుని కనిపించారు. ఆయన వెనుక సంయుక్తా విశ్వనాథన్ గ్లామర్ లుక్ చూపించారు. ఆవిడ చేతిలో కూడా గన్ ఉంది. సో... హీరోయిన్ కూడా యాక్షన్ సీన్స్ చేస్తారని ఊహించవచ్చు.
గూఢచారిగా వెన్నెల కిశోర్...
ప్రశాంతంగా ఉండే నగరానికి ప్రమాదం రావడంతో... ఆ కేసును పరిష్కరించడానికి కన్ ఫ్యూజ్డ్ స్పై చారి వస్తారు. అతను ఎలా సాల్వ్ చేశానేది? సినిమా. సినిమాలో హిలేరియస్ కామెడీ సీన్లతో పాటు సీరియస్ కాన్‌ఫ్లిక్ట్ కూడా ఉందట. ఈ సినిమాలో వెన్నెల కిశోర్ గూఢాచారిగా కనిపించనున్నారు. ఇదొక స్పై యాక్షన్ కామెడీ సినిమా అని, సిల్లీ మిస్టేక్స్ చేసే ఒక స్పై పెద్ద కేసును ఎలా ఛేదించాడు అనే విషయాన్ని ఈ సినిమా అని, వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ స్పై రోల్స్ చేశారని చెప్పారు డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్. ఇక ఈ జనరేషన్ కమెడియన్లలో తనకంటూ సపరేట్ కామెడీ స్టైల్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఈ సినిమాలో ఏ విధంగా నవ్విస్తారో థియేటర్లలో చూడాలి.
బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోని ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్‌గా నటిస్తుంది. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, 'తాగుబోతు' రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. సైమన్ కె కింగ్ సంగీతం అందిస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా 'చారి 111' పాటలు విడుదల కానున్నాయి.
Also Read: 'యూఐ' తెలుగు డబ్బింగ్ షురూ - హైదరాబాద్‌లో స్టార్ట్ చేసిన ఉపేంద్ర!