Upendra UI Dubbing for Telugu Version: క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర‌.. నా రూటే స‌ప‌రేటు.. అన్న‌ట్లుగా ఉంటాడు. అలా డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తుంటాడు. ఇక గ‌త కొంత‌కాలంగా వెండితెర‌కు దూరంగా ఉన్న ఆయ‌న‌.. స‌రికొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. 'యూఐ' పేరుతో కొత్త సినిమాలో న‌టించ‌డంతో పాటు.. దాన్ని డైరెక్ట్  చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించి.. గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. ఇటీవ‌ల టీజ‌ర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పెరిగిపోయింది. ఇక తాజాగా యూఐకి తెలుగు డ‌బ్బింగ్ చెప్పేందుకు ఉపేంద్ర హైద‌రాబాద్ చేరుకున్నారు. 


హైద‌రాబాద్ లో ఉపేంద్ర‌.. 


'యూఐ' సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌రికి వ‌స్తోంది. దీంతో సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా సాగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఉపేంద్ర ఇప్పుడు హైద‌రాబాద్ చేరుకున్నాడు. తెలుగు వెర్ష‌న్ కి డ‌బ్బింగ్ చెప్పేందుకు ఆయ‌న ఇక్క‌డికి చేరుకున్నారు. ఉపేంద్ర డ‌బ్బింగ్ చెప్తున్న వీడియో కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.      






 


అంచ‌నాలు పెంచేస్తున్న 'యూఐ'.. 


హీరోగా న‌టించిన ఉపేంద్ర‌.. చాలా సినిమాలు ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారు. త‌ర్వాత గ్యాప్ ఇచ్చారు ఆయ‌న‌. ఇక ఇప్పుడు మ‌రోసారి ద‌ర్శ‌కుడిగా సినిమా తీస్తుండ‌టంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఇక గ‌తేడాది సెప్టెంబ‌ర్ లో త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట గ్లింప్స్ ని రిలీజ్ చేశారు ఉపేంద్ర‌. ఆ త‌ర్వాత టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఈ రెండు చూసిన త‌ర్వాత 'యూఐ' మీద అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమా కోసం అంద‌రూ ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. ‘అంతా చీకటిగా ఉంది. దీని నుండి ఎలా తప్పించుకుంటావు?’ అనే డైలాగ్‌తో ‘యూఐ’టీజర్ ప్రారంభమయ్యింది. ఆ తర్వాత టీజర్ మొత్తంలో ఒక్క డైలాగ్ కూడా లేదు. కేవలం పలువురు యాక్టర్ల షాట్స్ మాత్రమే ఉన్నాయి. చివర్లో గుర్రంపై ఉపేంద్ర ఎంట్రీ ఇచ్చారు. అలా ఈ సినిమాలో తన లుక్‌ను రివీల్ చేసి హైప్ క్రియేట్ చేశారు ఉపేంద్ర‌. 



రూ.100 కోట్ల బడ్జెట్‌తో..


2015లో ‘ఉప్పి 2’ అనే మూవీని డైరెక్ట్ చేసి నటించారు ఉపేంద్ర. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన మళ్లీ మైక్రోఫోన్ పట్టలేదు. ఇక ఇప్పుడు 'యూఐ'ని దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. లహరీ ఫిల్మ్స్ ఎల్‌ఎల్‌పీతో పాటు వీనస్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు ఈ సిన‌మాని నిర్మిస్తున్నాయి. వర్చువల్ రియాలిటీ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుందని గ్లింప్స్‌లోనే రివీల్ చేశారు. ఇందులో ఉపేంద్రతో పాటు సన్నీ లియోన్, మురళీ శర్మ, నిధి సుబ్బయ్య, ఇంద్రజీత్ లంకేశ్, మురళీ కృష్ణలాంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ‘యూఐ’ చిత్రంలో 90 శాతం గ్రాఫిక్సే ఉంటాయని, దానికోసం చాలా ఖర్చుపెట్టామని ఇప్పటికే ఉపేంద్ర ఒక సందర్భంలో బయటపెట్టారు. ఇక ఇప్పుడు ఈ సినిమా డ‌బ్బింగ్ కూడా మొద‌ల‌వ్వ‌డంతో.. త్వ‌ర‌లోనే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. 


Also Read: వామ్మో! జ‌గ‌న్ పాత్రలో నటించడానికి జీవా అన్ని కోట్లు తీసుకున్నాడా?